త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | కేసీఆర్ ఆనవాళ్లు చేర్పేస్తావా..! సెక్ర‌టేరియ‌ట్ రేవంత్ రెడ్డి అయ్య జాగీరా..? : ఎమ్మెల్యే త‌ల‌సాని

Talasani Srinivas Yadav | కేసీఆర్ ఆనవాళ్లు చేర్పేస్తా అంటున్నారు.. సెక్రటేరియట్ రేవంత్ రెడ్డి అయ్యా జాగీరా..? అని మాజీ మంత్రి, స‌నత్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మండిప‌డ్డారు. దేశ చిత్ర‌ప‌టంలో తెలంగాణను పెట్టింది కేసీఆర్.. మాట్లాడ‌టానికి సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి అని ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On May 31, 2026, 5.00 pm IST

Talasani Srinivas Yadav | కేసీఆర్ ఆనవాళ్లు చేర్పేస్తావా..! సెక్ర‌టేరియ‌ట్ రేవంత్ రెడ్డి అయ్య జాగీరా..? : ఎమ్మెల్యే త‌ల‌సాని
Advertisement

Talasani Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్ : కేసీఆర్ ఆనవాళ్లు చేర్పేస్తా అంటున్నారు.. సెక్రటేరియట్ రేవంత్ రెడ్డి అయ్యా జాగీరా..? అని మాజీ మంత్రి, స‌నత్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మండిప‌డ్డారు. దేశ చిత్ర‌ప‌టంలో తెలంగాణను పెట్టింది కేసీఆర్.. మాట్లాడ‌టానికి సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి అని ధ్వ‌జ‌మెత్తారు. పాల‌న గాలికి వదిలేసి ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడు.. మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీ 35 ఏండ్ల వ‌ర‌కు క‌న‌బ‌డ‌దు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ని అయిపోయింద‌ని త‌ల‌సాని తేల్చిచెప్పారు. కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పాల్గొని ప్ర‌సంగించారు.

SIR ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. SIR పేరుతో ఓట్లు తొలగించడం జరుగుతుంది. ఓటు అనేది ప్రతి ఒకరి హక్కు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారు. SIR పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఓటు హక్కు తొలగించే హక్కు ఎవరికి లేదు. కానీ ఈ కేంద్రం SIR పేరుతో తొలగిస్తుంది. 18 సంవత్సరాల నిండిన వారు ఓటు ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ కూడా పెద్ద ఎత్తున జరగాలి. ఈ సారి మెంబర్‌షిప్ డ్రైవ్ డిజిటల్‌లో చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. కంటోన్మెంట్ ప్రజలకు సురక్షిత మంచినీరు అందజేశామ‌ని త‌ల‌సాని గుర్తు చేశారు.

హామీలు గాలికి వదిలేశారు..

అలవి కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం వచ్చాక.. హామీలు గాలికి వదిలేశారు. ఒక్క పథకం సక్రమంగా అమలు కావడం లేదు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాం. దివంగత ఎమ్మెల్యే సాయన్న నాయకత్వంలో కంటోన్మెంట్‌ను అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపారని త‌ల‌సాని పేర్కొన్నారు.

మళ్లీ వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే..

కాంగ్రెస్ పాలనలో అక్రమ కేసులు తప్ప ఏం లేదు. బాల్క సుమన్‌పై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారు. మళ్లీ వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే. అప్పుడు వారి ఆటలు సాగవు.. మిత్తితో సహా చెల్లిస్తాం. కంటోన్మెట్ ఇంకా అభివృద్ధి జరగాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం. మళ్లీ వచ్చేది గులాబీ జెండానే. అంద‌రూ యూనిటీగా ఉండాలి. కాంగ్రెస్‌ను ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారని త‌ల‌సాని అన్నారు.

హుస్సేన్ సాగర్‌లో పడి సచ్చేవాడిని.. 

హైడ్రా కూల్చివేతలు జరిగితే ముఖ్యమంత్రిని ఎలా తిట్టారో అందరూ చూశారు. నన్ను అలా తిడితే హుస్సేన్ సాగర్‌లో పడి సచ్చేవాడిని. కానీ రేవంత్ రెడ్డికి ఇంత కూడా మానం లేదు. ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ పాలనలో ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ఏం పాలన చేస్తున్నాడు.. రేవంత్ రెడ్డి అని ధ్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్ చేసిన యాగం ఎవరు చేయలేదు..

కేసీఆర్ చేసిన యాగం ఎవరు చేయలేదు. ఇప్పుడు హిందూ మతము ధర్మం అనీ చెబుతున్నారు. కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారు. రేవంత్ దుర్మార్గ పాలన చూసాక అందరూ కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ దూసుకుపోయింది. ఇప్పుడు ఢమాల్ అయ్యింది. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ఆగ‌మై పోయింది. గంగా జమునా తేహజీబ్.. పాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఇప్పుడు రాష్టలో అభద్రత భావం వ్యక్తమవుతుంది అని త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement