Harish Rao | రేవంత్ రెడ్డే చిల్లరోడు.. నా పుట్టుక, నా చావు బీఆర్ఎస్‌లోనే..
Harish Rao | పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డినే చిల్లరోడు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. నా పుట్టుక, నా చావు బీఆర్ఎస్‌లోనే.. నా ప్రయాణం కేసీఆర్‌తోనే అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
పూటకో పార్టీ మారేది నువ్వు..
మోదీ పాట పాడేది నువ్వు..
నా పుట్టుక, నా చావు బీఆర్ఎస్‌లోనే..
నా ప్రయాణం కేసీఆర్‌తోనే..
100 సార్లు చెప్పాను..
మళ్లీ చెబుతున్నా..
తేల్చిచెప్పిన హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డినే చిల్లరోడు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. నా పుట్టుక, నా చావు బీఆర్ఎస్‌లోనే.. నా ప్రయాణం కేసీఆర్‌తోనే అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. సిద్దిపేటలో హరీశ్‌రావు ఆదివారం మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చిల్లరాయన. ఇప్పటికీ చాలాసార్లు చిల్లర మాటలు మాట్లాడిండు. ఆయన మాటకు క్రెడిబిలిటీ ఉందా అసలు. నాలుగు పార్టీలు మారినోడు.. రోజుకు నాలుగు అబద్ధాలు మాట్లాడేటోడు. 400 అబద్ధపు హామీలిచ్చి అడ్డదారిలో అధికారం ఎక్కినోడు. పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేస్తానని చెప్పి దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు. సిద్దిపేటలో ఆయిన్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా 45 రోజుల్లో 9 వేల కోట్లు రైతుబంధు డబ్బులు వేస్తానని మాట తప్పిన ఈ రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఉందా..? అబద్ధాలు చెప్పుడు అడ్డమైన మాటలు మాట్లాడుడు. అడ్డదారిలో అధికారాన్ని అనుభవించుడు. అబద్దాల గారడీతో కాలం వెల్లదీసుడు తప్ప ఇంకేమైనా ఉన్నద రేవంత్ రెడ్డి. కనబడిన ప్రతి దేవుడి మీద ఒట్టు పెట్టి.. ఎగబెట్టింది నీవు కాదా..? 45 రోజుల్లో రైతుబంధు వేస్తానని 65 రోజులైనా ఇవ్వకుండ ఎగబెట్టింది నీవు కాదా..? పూటకో పార్టీ మారి.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడుతాడా..? అని హరీశ్‌రావు మండిపడ్డారు.
నా జీవితమంతా కేసీఆర్.. నేను బతికున్నంత కాలం బీఆర్ఎస్..
నేను ఇప్పటికీ వంద సార్లు చెప్పినా.. నా జీవితమంతా కేసీఆర్.. నేను బతికున్నంత కాలం బీఆర్ఎస్ అని వందసార్లు చెప్పినా.. ఇంకో వందసార్లు చెప్తా. నవ్వు చిల్లరోడివి. అసలు నీకు నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా..? గురివింద గింజ తన కింద నలుపు ఎరగదు అన్నట్టు.. పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితమంతా.. పుట్టుక బీఆర్ఎస్‌లోనే, చావు బీఆర్ఎస్‌లోనే అని గతంలో చెప్పినా.. మళ్లీ చెప్తున్నా.. కొత్తగా చెప్పేది ఏముంది.. నువ్వు పూటకో పార్టీ మారుతవ్. ఇవాళ కాంగ్రెస్‌లో ఉన్నవ్.. మోదీ, బీజేపీ పాట పాడుతున్నవ్. రేపు ఎక్కడుంటవో తెలియదు.. నువ్వా నా గురించి మాట్లాడేది. నైతికతకు, నిజాయితీకి కట్టుబడి రాజకీయాల్లో పని చేస్తున్నాను. విలువలతో ఉన్నాను.. నీకు విలువలే లేవు. అసలు నీ ఇంటి పేరు మార్చుకో. ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు.. అబద్ధాల రేవంత్ రెడ్డివి. చిల్లర మాటలు మానుకో.. చిల్లర బుద్ధి నీది. చిల్లర ఆలోచనలు నీవి. పార్టీలు మారే గుణం నీది. నీతి, విలువలు, నిజాయితీతో రాజకీయాల్లో ఉన్నానని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

Harish Rao | ‘రైతు డిస్కం’ వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
మే 31, 2026

Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
మే 31, 2026

CM Revanth Reddy Asifabad Tour | ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత షురూ: రేపు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
మే 31, 2026
తాజావార్తలు
- ●Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
- ●Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు
- ●Sobhita Dhulipala | శోభిత ధూళిపాళ తమిళ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ - డైరెక్టర్ ఎవరంటే?

Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్

Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్



