త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | 24 గంట‌ల విద్యుత్ ఇస్తేనే ఓట్ల‌డుగుతా అని చెప్పే ద‌మ్ముందా..? సీఎం రేవంత్‌కు హ‌రీశ్‌రావు స‌వాల్

Harish Rao | రాష్ట్రంలోని రైతాంగానికి 24 గంట‌ల క‌రెంట్ ఇస్తేనే ఓట్లు అడుగుతాన‌ని చెప్పే ద‌మ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా..? అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరారు. రైతుల‌కు 24 గంట‌ల క‌రెంట్ బంద్ చేసి 8 నుంచి 9 గంట‌ల క‌రెంట్ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంద‌న్నారు.

S

Telangana | Published On May 31, 2026, 6.02 pm IST

Harish Rao | 24 గంట‌ల విద్యుత్ ఇస్తేనే ఓట్ల‌డుగుతా అని చెప్పే ద‌మ్ముందా..? సీఎం రేవంత్‌కు హ‌రీశ్‌రావు స‌వాల్
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని రైతాంగానికి 24 గంట‌ల క‌రెంట్ ఇస్తేనే ఓట్లు అడుగుతాన‌ని చెప్పే ద‌మ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా..? అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరారు. రైతుల‌కు 24 గంట‌ల క‌రెంట్ బంద్ చేసి 8 నుంచి 9 గంట‌ల క‌రెంట్ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంద‌న్నారు. సిద్దిపేట‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు.. మూడు గంటలు చాలని ఓ వైపు సీఎం రేవంత్‌ రెడ్డి.. మరోవైపు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వ విధానం చూశాం. గతంలో రేవంత్‌ రెడ్డి రైతులకు మూడు గంటలు కరెంట్‌ చాలు అని చెప్పారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం తరుపున, కాంగ్రెస్ పార్టీ తరపున రైతు కమిషన్ చైర్మన్‌గా అధికారిక హోదాలో ఆయన వాదనలు వినిపించారు. అది ఈ రోజు ఈఆర్సీ ముందు రికార్డై ఉంది. రేవంత్‌ రెడ్డి కూడా 3 గంటలు చాలన్నడు. రేవంత్‌ రెడ్డిలాగా అబద్దాలు మాట్లాడుడు మాకు ఇంటా వంటా లేదు. మాకు నీతి, నిజాయితీ తెలుసు.. ఏది మాట్లాడినా పద్దతి తెలుసు. ఆధారాలతో, లెక్కలతో మాట్లాడుతం. రేవంత్‌ రెడ్డిలాగా బట్ట కాల్చి మీదేయడమో.. అబద్దాలు మీదేసి పబ్బం గడుపుకునే అల‌వాటు లేద‌న్నారు హ‌రీశ్‌రావు.

13 గంటలకు మించి ఉచిత విద్యుత్ రావడం లేదు..

రాష్ట్ర రైతాంగానికి ఇప్పుడే కరెంట్‌ రావట్లేదు. ఈ రోజు ఏ ఊరికన్నా పోదాం. ఈ మధ్యకాలంలో నేను నర్సాపూర్ సబ్‌స్టేషన్‌కు వెళ్లిన. జహీరాబాద్‌ సబ్‌స్టేషన్‌కు వెళ్లిన, సిద్దిపేటలో సబ్‌స్టేషన్‌కు వెళ్లిన ఎక్కడికి వెళ్లినా రైతులకు ఈ రోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. నువ్వేదో 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు నేను ఆర్‌పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పివవ్‌. నువ్వువచ్చిన తర్వాత 24 గంటలవిద్యుత్‌కు మంగళం పాడినవ్‌. ఈ రోజు రాష్ట్రంలో ఏ రైతుకు కూడా 13 గంటలకు మించి ఉచిత విద్యుత్ రావడం లేదని అన్నారు.

ఆర్‌పీడీసీఎల్‌ ఏర్పాటుతో 8-9 గంటల కరెంట్‌..

ఇవాళ నీ ఆర్‌పీడీసీఎల్‌ ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతది. నాకు నీ బడేబాయ్‌ (నరేంద్ర మోదీ) చెప్పినట్టు అనిపిస్తుంది. గుజరాత్‌లో ఇవాళ కేవలం 7 గంటల కరెంటే వస్తది. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 8 గంటలు మాత్రమే వస్తుంది. రేపు తెలంగాణలో కూడా అదే జరుగబోతుంది. ఇది నేను ఉత్తగనే మాట్లాడటం లేదు. మొన్న ఆర్‌పీడీసీఎల్ ఏర్పాటు సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవ్‌ నంబర్ 8 ప్ర‌కారం రినెవెబుల్‌ ఎనర్జీ (సోలార్‌ పవర్‌) టీజీఆర్‌పీడీసీఎల్‌కు కేటాయించినమని చెప్పారు. సోలార్‌ పవర్‌ పొద్దున సూర్యోదయమై 7 గంటలకు మొదలవుతది.. సూర్యాస్తమమయ్యే 6 గంటలకు సోలార్ పవర్‌ ఆగిపోతది. అంటే రైతులకు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లకు, మంచినీటి పథకాలకు టీజీఆర్‌పీడీసీఎల్‌ కింద ప్రభుత్వం పెట్టేసింది అని హ‌రీశ్‌రావు తెలిపారు.

థర్మల్‌ పవర్‌, హైడల్ పవర్‌ ఇయ్యడట..

మరి టీజీఆర్‌పీడీసీఎల్‌కు రేవంత్‌ రెడ్డి ఏ కరెంట్ ఇస్తా అంటున్నడు.. సోలార్ పవర్‌ ఇస్తా అంటున్నడు. థర్మల్‌ పవర్‌, హైడల్ పవర్‌ ఇయ్యడట. కేవలం సోలార్ పవర్‌ ఇస్తా అంటున్నడు.. మరి సోలార్ పవర్‌ ఎప్పుడుంటది. పొద్దున 7 గంటలకు వస్తది.. సాయంత్రం 5 గంటలకు పోతది. అంటే 8-9 గంటలుంటది.. రేవంత్‌ రెడ్డి ఈ జీవో ద్వారా చెప్పకనే ఏం చెప్పిండంటే.. రేపు రాష్ట్రంలో రైతులకు ఈ జీవో ద్వారా 8-9 గంటలు కరెంట్ ఇస్తా అని ఈ జీవోలో చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తేనే ఓట్లు అడుగుతాన‌ని చెప్పే ద‌మ్ముంటే.. త‌న చాలెంజ్‌ను స్వీక‌రించాల‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement