MP Chaamala Kirankumar Reddy | ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ బలోపేతం కోసమే రైతు డిస్కం: ఎంపీ చామల
MP Chaamala Kirankumar Reddy | ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ బలోపేతం కోసమే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కాబట్టే ఈఆర్సీ వద్ద అన్ని పార్టీల వాళ్లు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.
- ఎన్‌పీడీసీఎల్ 9వ ర్యాంకు నుంచి 54కు పడిపోయింది
- ఎస్‌పీడీసీఎల్ 16 నుంచి 42వ ర్యాంకుకు దిగజారింది
- విద్యుత్ బకాయిలు రూ.1595 కోట్ల నుంచి రూ.31,698 కోట్లకు చేరాయి
- కవితకు, బీఆర్ఎస్‌కు డిస్కంలపై మాట్లాడే అర్హత లేదు
- ఈఆర్సీ బహిరంగ విచారణలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఫైర్
MP Chaamala Kirankumar Reddy | త్రినేత్ర.న్యూస్: ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ బలోపేతం కోసమే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్చ లేకుండా నాలుగు గోడల మధ్య నిర్ణయాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కాబట్టే ఈఆర్సీ వద్ద అన్ని పార్టీల వాళ్లు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈఆర్సీ బహిరంగ విచారణకు శుక్రవారం ఆయన హాజరై ప్రభుత్వం రైతు డిస్కం ఎందుకు తెస్తుందో వివరించారు.
న్యాణ్యమైన కరెంటు ఇవ్వడానికే..
రైతు డిస్కం ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలు ఊహాజనితంగా మాట్లాడుతున్నాయి. రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం రైతు డిస్కం ఏర్పాటు చేసింది. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి దేశంలో ఎన్.పి.డి.సి.ఎల్ 9వ ర్యాంకులో ఉండేది. ఈరోజు 54 వ ర్యాంకుకు పడిపోయింది. కింద నుంచి మూడో స్థానానికి ఎన్.పి.డి.ఎస్.ఎల్ పడిపోయింది. 2014లో ఎస్.పి.డి.సి.ఎల్ దేశంలో 16వ ర్యాంకులో ఉంటే నేడు 42వ ర్యాంకులో ఉంది. 2014లో విద్యుత్ బకాయిలు రూ.1595 కోట్లు ఉండేవి. ఇప్పుడు రూ.31,698 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఇన్ని అప్పులు అయ్యాయి? అని ఎంపీ చామల ప్రశ్నించారు.
కాళ్లల్లో కట్టెలు పెట్టడమే బీఆర్ఎస్ పని..
2017లోనే స్మార్ట్ మీటర్ల అంశం వచ్చింది. ఎన్.పి.డి.సి.ఎల్, ఎస్.పి.డి.సి.ఎల్ ను బలోపేతం చేయడం కోసమే రైతు డిస్కంను ఏర్పాటు చేస్తున్నాం. పదేళ్ల కాలంలో డిస్కంలను అప్పుల కుప్పగా మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చెడు ప్రచారం చేయడమే బీఆర్ఎస్ నేతల అజెండా. కాళ్లల్లో కట్టెలు పెట్టడం ఆ పార్టీ లక్ష్యం. కవిత గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గత ప్రభుత్వం తప్పులకు కవితకు బాధ్యత ఉంటుంది. ఒకే గూటి పక్షులు ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రజా పాలన గురించి బీఆర్ఎస్ వాళ్లకు మాట్లాడే అర్హత లేదు అని కిరణ్‌కుమార్‌రెడ్డి ఫైరయ్యారు.
కరెంటు మిస్ యూజ్ కాకుండా మీటర్లు పెడుతున్నారు. రైతులు బిల్లులు కట్టకుండా దొంగలు ఎట్లా అవుతారు? 2017, జూన్ 4న కేంద్ర ఇంధన శాఖతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లపై ఒప్పందం కుదుర్చుకుంది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగం కుప్పకూలింది. రైతులను తప్పుదోవ పట్టించే విధంగా కవిత, బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు అని ఎంపీ చామల విమర్శించారు.
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల






