త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Musharraf Ali Faruqui | రైతు పేరుతో విద్యుత్ దుర్వినియోగం.. అందుకే కొత్త డిస్కం : సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ

Musharraf Ali Faruqui | తెలంగాణ‌లో రైతు పేరుతో చాలా వ‌ర‌కు విద్యుత్ దుర్వినియోగం అవుతుంద‌ని తెలంగాణ రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On May 29, 2026, 7.08 pm IST

Musharraf Ali Faruqui | రైతు పేరుతో విద్యుత్ దుర్వినియోగం.. అందుకే కొత్త డిస్కం : సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ
Advertisement

Musharraf Ali Faruqui | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో రైతు పేరుతో చాలా వ‌ర‌కు విద్యుత్ దుర్వినియోగం అవుతుంద‌ని తెలంగాణ రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌లోని విద్యుత్ నియంత్ర‌ణ భ‌వ‌న్‌లో రైతు డిస్కంపై టీజీఈఆర్సీ శుక్ర‌వారం నిర్వ‌హించిన బ‌హిరంగ విచార‌ణ స‌మావేశంలో సీఎండీ ముషార‌ఫ్ అలీ ఫారూఖీ మాట్లాడారు.

రైతు పేరుతోని చాలా వ‌ర‌కు విద్యుత్‌ వేరే అంశాల‌కు డైవ‌ర్ట్ అవుతుంది. దాంతోని రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుంది. 1/3వ వంతు వినియోగం దాదాపు 25 వేల మిలియ‌న్ యూనిట్లు అగ్రిక‌ల్చ‌ర్ పేరుతో మ‌నం అకౌంటింగ్‌ చూపిస్తున్నాం. వాస్త‌వంగా 25 వేల మిలియ‌న్ యూనిట్లు కేవ‌లం రైతులు వాడుతున్నారా..? లేక రైతు పేరుతో వేరేవాళ్లు ఎవ‌రైనా వాడుతున్నారా..? అనేది పెద్ద ప్ర‌శ్నగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

క‌రెంట్ స‌మ‌స్య‌లు తీర్చేందుకు ప్ర‌త్యేక డిస్కం అవ‌స‌రం. రైతుల మోటార్ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో మీట‌ర్లు పెట్టం. రైతుల‌కు నాణ్య‌మైన క‌రెంట్ అందించ‌డ‌మే రైతు డిస్కం ల‌క్ష్యం. ప్ర‌స్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డిస్కంల‌లో వ్య‌వ‌సాయం, ప‌రిశ్ర‌మ‌లు, ఇత‌ర క‌నెక్ష‌న్లు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అవ‌న్నీ చూసుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. అందుకే రైతుల‌కు ప్ర‌త్యేక డిస్కం పెట్టాల‌ని నిర్ణ‌యించాం. దేశానికి వెన్నెముక అయిన రైతుల‌కు పూర్తిస్థాయిలో విద్యుత్ విష‌యంలో న్యాయం జ‌ర‌గ‌డం లేదు. అందుకోసం క‌నెక్ష‌న్లు, ట్రాన్స్‌మిష‌న్లు, డీటీఆర్‌ల బ‌ద‌లాయింపు, ఉద్యోగుల బ‌ద‌లాయింపు ప్ర‌క్రియ ప్రారంభించినం. తెలంగాణ డిస్కంలు తీవ్ర ఆర్థిక స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స‌మ‌గ్ర ర్యాంకింగ్స్‌లో తెలంగాణ డిస్కంల‌కు సీ రేటు ల‌భించడ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. ఇది దేశంలోని డిస్కంల‌లో తెలంగాణ డిస్కంల ప‌నితీరు త‌క్కువ‌గా ఉంద‌ని సూచిస్తుంద‌ని డిస్కం సీఎండీ ముషార‌ఫ్ అలీ ఫారూఖీ తెలిపారు.

Advertisement
Advertisement