RTC Strike | చర్చలు సఫలం.. బస్సులు రైట్ రైట్..
RTC Strike | ఆర్టీసీ సమ్మె విరమణ దిశగా మంత్రుల బృందం కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. మొత్తం 32 డిమాండ్లలో ఇప్పటికే 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కాగా, సంక్లిష్టమైన మిగతా 3 డిమాండ్లపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పట్టనున్నది.
నిర్దిష్ట సమయంలో.. ఆర్టీసీ విలీనం
సమ్మె విరమణకు కార్మిక సంఘాల అంగీకారం
టైమ్ బౌండ్ డెడ్ లైన్ పెట్టుకొని
ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
RTC Strike | త్రినేత్ర.న్యూస్ : ఆర్టీసీ సమ్మె విరమణ దిశగా మంత్రుల బృందం కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. మొత్తం 32 డిమాండ్లలో ఇప్పటికే 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కాగా, సంక్లిష్టమైన మిగతా 3 డిమాండ్లపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పట్టనున్నది. కాగా, ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22 నుంచి మొదలుపెట్టిన నిరవధిక సమ్మెను విరమించుకోవాలని జేఏసీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సమ్మెకు కారణమైన మూడు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్దిష్ట వ్యవధిని లక్ష్యంగా పెట్టుకుని పూర్తి చేయడానికి మంత్రుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మిక సంఘాల (ట్రేడ్ యూనియన్) ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించుకుని ఫైనల్ చేసుకోవాలని ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న 2021, 2025 పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను చెల్లించడానికి కూడా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. దీంతో కార్మిక సంఘాలు సమ్మెను విరమించడానికి అంగీకరించాయని సమాచారం. మరికొద్దిసేపట్లో ప్రభుత్వం నుంచి, కార్మిక సంఘాల జేఏసీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడనున్నది.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



