త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | త్యాగాల‌తో వ‌చ్చిన తెలంగాణ దొంగ‌ల పాలైంది : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌

RS Praveen Kumar | కేసీఆర్ ఎంతో శ్ర‌మ‌కోర్చి, ఉద్య‌మం చేసి.. 1300 మంది అమ‌ర‌వీరుల త్యాగాల‌తో వ‌చ్చిన తెలంగాణ నేడు దొంగ‌ల‌, రాబందుల పాలైంద‌ని బీఆర్ ఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

P

Telangana | Published On Feb 17, 2026, 4.18 pm IST

RS Praveen Kumar | త్యాగాల‌తో వ‌చ్చిన తెలంగాణ దొంగ‌ల పాలైంది : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌
Advertisement

RS Praveen Kumar | కేసీఆర్ ఎంతో శ్ర‌మ‌కోర్చి, ఉద్య‌మం చేసి.. 1300 మంది అమ‌ర‌వీరుల త్యాగాల‌తో వ‌చ్చిన తెలంగాణ నేడు దొంగ‌ల‌, రాబందుల పాలైంద‌ని బీఆర్ ఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేస్తున్నామని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్క‌టై డ్రామాలు చేస్తున్నాయని ఆరోపించారు. బండి సంజ‌య్ కుమార్‌, రేవంత్‌రెడ్డి ఒక‌రికొక‌రు ర‌క్ష‌ణ‌గా ఉన్నార‌ని.. బండి సంజయ్‌కు రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్, బీజేపీకి రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఉన్నట్లు బయటపడిందన్నారు. ఇవ‌న్నీ చూస్తే ఎలక్షన్ కమిషన్ ఉందా? అనే అనుమానం తెలంగాణ ప్రజలకు కలుగుతోందన్నారు.

ఒకటే సీటు వచ్చిన కాంగ్రెస్‌కు ఆమనగల్‌లో బీజేపీ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. దేశంలో మోదీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని విమర్శించారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, మున్సిపాలిటీని అక్రమంగా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఎలా చెప్తే అధికారులు అలా నడుచుకుంటున్నారని, కోరం ఉన్నప్పటికీ వాయిదా వేస్తున్నారని మండిప‌డ్డారు. రాష్ట్ర ఎలెక్షన్ కమిషన్ దేనికి ఉంద‌ని ప్ర‌శ్నించారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారని, ఒక పోలీస్ అధికారిగా ఈ మాట చెప్పేందుకు బాధగా ఉందన్నారు. తమ నాయకులపై కేసులు ఉన్నాయని లోపలికి అనుమతి ఇవ్వడం లేదని, సీఎం రేవంత్ రెడ్డిపై కూడా అనేక కేసులు ఉన్నాయని గుర్తు చేశారు.

జనగాం మున్సిపాలిటీలో దళిత మహిళ అయిన ఇండిపెండెంట్ అభ్యర్థిపై కాంగ్రెస్ కౌన్సిలర్ కరుణాకర్ రెడ్డి దాడి చేశారని ఆరోపించారు. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే మౌనం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. తొర్రూరు మున్సిపాలిటీలో ఎంపీ క‌డియం ఎక్స్ అఫీషియో ఓటు వేశారని, రెండు చోట్ల ఓటు రిజిస్టర్ చేసుకుని ఓటేసిందని ఆరోపించారు. వరంగల్ ఎంపీగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్ కూడా రెండు చోట్ల ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారని ఆరోపించారు. అవకాశం ఉన్న చోట్ల ఓటు వేసేలా ప్లాన్ చేసుకున్నారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని, రాజ్యాంగం అపహాస్యానికి గురవుతోందన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఒకరికొకరు ఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్ బలగాల్లా రక్షణగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

జాతీయ ఎలక్షన్ కమిషన్‌కు వన్నె తెచ్చిన అధికారి టీఎన్ శేషన్ అని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. జనగాం కౌన్సిల్ కార్యాలయంలోకి పోలీసులు వెళ్లడం అక్రమమని, పార్లమెంట్, అసెంబ్లీ హాళ్లలోకి పోలీసులు వెళ్తారా? అని ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశంలోకి పోలీసులను ఎలా అనుమతిస్తారని నిలదీశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అణిచివేతకు తిరుగుబాటు నాంది పలుకుతుందని హెచ్చరించారు. నేపాల్, బంగ్లాదేశ్‌లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడాలని సూచించారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆరోగ్యం బాగోలేక ఇంట్లో ఉంటే కిడ్నాప్ అయ్యాడని ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. జనగాం కాంగ్రెస్ కౌన్సిలర్‌పై కేసు నమోదు చేయాలని, పోలీసుల పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలో జరుగుతున్న పరిణామాలపై స్టేట్ ఎలెక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.

Advertisement
Advertisement