త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Safety | రోడ్డు భద్రతే ప్రధాన లక్ష్యం కావాలి.. కొత్త ఆర్‌టీఓలకు అభిలాష్ బిస్త్ పిలుపు

Road Safety | రోడ్డు ప్రమాదాల నివారణకు సాంకేతికత ఆధారిత అమలు, కట్టుదిట్టమైన తనిఖీలు, ప్రజల్లో అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ నూతన రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులకు సూచించారు. తెలంగాణ రవాణా శాఖకు చెందిన ముగ్గురు ఆర్‌టీఓల కోసం రెండు నెలల పాటు నిర్వహించిన ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది.

P

Telangana | Published On Jul 17, 2026, 9.45 pm IST

Road Safety | రోడ్డు భద్రతే ప్రధాన లక్ష్యం కావాలి.. కొత్త ఆర్‌టీఓలకు అభిలాష్ బిస్త్ పిలుపు
Advertisement

Road Safety | రోడ్డు ప్రమాదాల నివారణకు సాంకేతికత ఆధారిత అమలు, కట్టుదిట్టమైన తనిఖీలు, ప్రజల్లో అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ నూతన రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులకు సూచించారు. తెలంగాణ రవాణా శాఖకు చెందిన ముగ్గురు ఆర్‌టీఓల కోసం రెండు నెలల పాటు నిర్వహించిన ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన వాలెడిక్టరీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె శిక్షణ పూర్తి చేసిన డీ జగదీష్, పీ భూషి రెడ్డి, చై సాయి చరణ్‌లకు సర్టిఫికెట్లు అందజేశారు.

కార్యక్రమానికి రవాణా శాఖ అదనపు కమిషనర్ సీ రమేశ్‌ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నియంత్రణలో పోలీస్ శాఖతో పాటు రవాణా శాఖ కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వాహనాల ఫిట్‌నెస్, డ్రైవింగ్ లైసెన్సుల మంజూరులో నాణ్యతను పాటిస్తే అనేక ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. విద్య, ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అనే మూడు అంశాలపై దృష్టి సారిస్తూ సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆమె సూచించారు.

అదనపు కమిషనర్ సీ రమేష్ మాట్లాడుతూ పోలీస్ అకాడమీలో అందించిన శిక్షణ ఫీల్డ్ స్థాయిలో అధికారులకు ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. శిక్షణ పొందిన ఆర్‌టీఓలు మోటార్ వెహికల్స్ చట్టం, అమలు విధానాలపై సమగ్ర అవగాహనతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శిక్షణ పూర్తి చేసిన అధికారులు కూడా కార్యక్రమం తమలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సేవా దృక్పథాన్ని మరింత పెంపొందించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ, రవాణా శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement