త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG High Court | ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్ వివాదం.. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ‌లు..!

TG High Court | జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధి వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. దూలపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 118, 119, 122లకు సంబంధించిన భూములపై ప్రస్తుతానికి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వంతో పాటు హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

P

Telangana | Published On Jul 17, 2026, 8.50 pm IST

TG High Court | ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్ వివాదం.. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ‌లు..!
Advertisement

TG High Court | జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధి వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. దూలపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 118, 119, 122లకు సంబంధించిన భూములపై ప్రస్తుతానికి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వంతో పాటు హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే నంబర్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయని పేర్కొంటూ గతంలో జారీ చేసిన 2019, 2023 నాటి జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. ఎఫ్‌టీఎల్ నిర్ధారణపై విచారణ కొనసాగుతున్నందున, అప్పటి వరకు భూ వినియోగ మార్పులు, నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను రద్దు చేయాలని జీవోలో పేర్కొంది.

ఈ మేరకు చర్యలు తీసుకోవాలని హైడ్రా, రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధిత భూయజమానులు హైకోర్టును ఆశ్రయించారు. 2013 నాటి ప్రాథమిక నోటిఫికేషన్, హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లోని క్యాడస్ట్రల్ మ్యాప్ ప్రకారం సర్వే నంబర్లు 118, 119, 122 ఎఫ్‌టీఎల్ పరిధిలో లేవని, అవి ఇప్పటికీ బఫర్ జోన్ వెలుపలే ఉన్నాయని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్ల వాదనలు, అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. వారి ఆస్తులపై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని, హైడ్రాను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.

Advertisement
Advertisement