Nirmal | టర్కీలో ప్రమాదం.. నిర్మల్ జిల్లా యువకుడు మృతి
Nirmal | బతుకుదెరువు కోసం టర్కీ వెళ్లిన నిర్మల్ (Nirmal) జిల్లాకు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. నిర్మల్ జిల్లా సోన్ మండంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన తోకల ఆదిత్య(23) ఐదు నెలల క్రితం ఉపాధి కోసం టర్కీ (Turkey) వెళ్లారు.
Nirmal | త్రినేత్ర న్యూస్: బతుకుదెరువు కోసం టర్కీ వెళ్లిన నిర్మల్ (Nirmal) జిల్లాకు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. నిర్మల్ జిల్లా సోన్ మండంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన తోకల ఆదిత్య(23) ఐదు నెలల క్రితం ఉపాధి కోసం టర్కీ (Turkey) వెళ్లారు. అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు గాయపడ్డారు. దీంతో వారం రోజులుగా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఆదిత్య కుటుంబసభ్యులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చొరవతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నారు. మృతుడికి తల్లిదండ్రులతోపాటు సోదరుడు ఉన్నారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిని ప్రయోజకుడిని చేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని పొరుగు దేశానికి పంపిస్తే, విగత జీవిగా తిరిగొస్తాడని కలలో కూడా ఊహించలేదంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు మృతిచెందడటంతో మాదాపూర్‌లో విషాదం నెలకొంది.
సంబంధిత వార్తలు

Hyderabad | యువకుడికి గుండు గీయించి.. నగ్నంగా డ్యాన్స్ చేయించారు..
అక్టోబర్ 22, 2026

Safety Advisory | ఫ్రాన్స్‌లో అల్లర్లు.. అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ భారతీయ పౌరులకు అలర్ట్
అక్టోబర్ 22, 2026

Bhavani Devotees | దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
అక్టోబర్ 22, 2026
తాజావార్తలు
- ●Hyderabad | యువకుడికి గుండు గీయించి.. నగ్నంగా డ్యాన్స్ చేయించారు..
- ●Safety Advisory | ఫ్రాన్స్‌లో అల్లర్లు.. అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ భారతీయ పౌరులకు అలర్ట్
- ●Bhavani Devotees | దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
- ●Municipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కారణం ఏంటంటే?
- ●Liquor Sales | సర్కారుకు కాసుల వర్షం.. దుమ్మురేపిన దసరా లిక్కర్ సేల్స్
- ●RRB Station Master | 1250 పోస్టులతో ఆర్ఆర్బీ రైల్వే స్టేషన్ మాస్టర్ నోఫికేషన్.. మారిన పరీక్ష విధానం..

Hyderabad | యువకుడికి గుండు గీయించి.. నగ్నంగా డ్యాన్స్ చేయించారు..

Safety Advisory | ఫ్రాన్స్‌లో అల్లర్లు.. అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ భారతీయ పౌరులకు అలర్ట్

Bhavani Devotees | దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

Municipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కారణం ఏంటంటే?



