CM Revanth Reddy | రాజులను గద్దెదించిన చరిత్ర ఆదిలాబాద్‌ది : సీఎం రేవంత్
CM Revanth Reddy | రాజులను గద్దెదించిన చరిత్ర ఆదిలాబాద్‌కు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పిప్రి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 'రాజకీయాల్లో మనిషిపట్ల విశ్వాసం ఉండాలి. మాటపై నమ్మకం ఉండాలి. సీఎల్పీ నాయకుడిగా ప్రజల దగ్గరకు వెళ్లాలి. ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు భవిష్యత్ ప్రణాళికలు రచించాలని ఉప ముఖ్యమంత్రి, నాటి సీఎల్పీ నాయకుడిగా ఈ పిప్రి ప్రాంతం నుంచే పీపుల్స్ మార్చ్‌ని ప్రారంభించి.. 1400 కిలోమీటర్లు కొనసాగించి.. ఖమ్మంలో లక్షలాది మంది సమక్షంలో ముగించడం జరిగింది. అధికారంలోకి రావాలనా, ప్రజలు ఆశ్వీరదిస్తారనే విశ్వాసంతో భట్టి విక్రమార్క ఈ ప్రాంత అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం మీతో నడుస్తూ, మీతో కలుస్తూ, మీ గూడాల్లో మీ తలుపు తడుతూ, మీ గుండెచప్పుడు వింటూ మీ సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కరించేందుకు కృతనిశ్చయానికి వచ్చారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో మేం చర్చించుకున్న నేపథ్యంలో వారు నేను కలిసి పీసీసీ అధ్యక్షుడిగా నిర్మల్‌లో నిరసన తెలిపినా, ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా కట్టినా.. పీపుల్స్ మార్చ్‌తో ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టినా, పీపీసీ అధ్యక్షుడిగా, సీఎల్పీ నాయకుడిగా తామంతా ఆదిలాబాద్‌పైనే దృష్టి పెట్టాం. ఈ ప్రాంత ప్రజలు అమాయకులు. ఆత్మగౌరవంతో బతికేవాళ్లు. నిరంకుశంగా వ్యవహరిస్తే.. వ్యతిరేకంగా నిటారుగా నిలబడి అమరులై రాజులనే గద్దెదించిన చరిత్ర ఆదిలాబాద్ గడ్డకు ఉన్నది' అన్నారు.
వారే స్ఫూర్తిదాతలు..
'ఆ నాడు కుమ్రంభీముడు కానీ, రాంజీగోండు కానీ నిజాం సర్కారులకు వ్యతిరేతికంగా ఈ నాడు వెయ్యి ఊర్ల మర్రిగా ప్రసిద్ధి పొందిన రాంజీగోండు త్యాగం.. జల్ జంగిల్ జమీన్ నినాదం ప్రపంచానికే వినిపించేంత గొప్పగా ఉద్యమాన్ని నడిపిన కుమ్రంభీం మీ బిడ్డ. మన గొప్ప స్ఫూర్తి ప్రదాత ఈ ఆదిలాబాద్ బిడ్డ. ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద, శ్రమచేయగలిగిన ప్రజలు, కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వాల ప్రణాళికల లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. ఈ ఆదిలాబాద్ ప్రాంతం దాదాపుగా 60శాతం అటవీ ప్రాంతం. ఇక్కడ అపారమైన ఖనిజసంపద, జలవనరులు ఉన్నాయి. ప్రాచీన సంస్కృతి ఉంది. కానీ, ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలేదు. ఈ ప్రాంతంలో వ్యవసాయం విస్తరించలేదు. ఈ ప్రాంతంలో విద్య, వైద్యం పేదలకు అందలేదు. గూడాల్లో పూరిగుడిసెలు ఇంకా గుడిసెలుగానే ఉన్నాయి. తాగడానికి నీరందని పరిస్థితి మన కండ్ల ముందు కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో గూడాల్లో పర్యటించాను' అని సీఎం గుర్తు చేసుకున్నారు.
కార్యకర్తల పోరాటంతో ప్రజాపాలన
'మిత్రుడు సోయంబాపురావుతో మాట్లాడి.. ఇక్కడ పటేళ్లను కలిసి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది.. మీ సమస్యలు పరిష్కరిస్తానని మాటిచ్చాను. మిత్రుడు ప్రేమ్‌సాగర్‌రావు ఎప్పుడు మాట్లాడినా మాకు ఒక సమయంలో నమ్మకం, విశ్వాసం సన్నగిల్లినప్పుడు అన్న మీరు అధైర్యపడకండి.. ప్రభుత్వం వస్తుంది. వచ్చాక సొంత పాలమూరు ఏ ప్రాంతాని ఏ ప్రాధాన్యం ఉంటుందో.. వెనుకబడిన, 70 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోని ఆదిలాబాద్‌ను పాలమూరుతోని సమానంగా అభివృద్ధి చేయాలని మాట ఇవ్వాలని.. ఈ ఆదిలాబాద్ జిల్లా మొత్తం నీకు అండగా నిలబడుతుందని అనేవాడు. వారు మాట్లాడినప్పుడు ధైర్యం వచ్చేది. గుండెనిండా ఊపిరి కొట్లాటకు సిద్ధమయ్యేది. మల్ల నెలతిరిగితేనే ఏమో ఏమైతదోనని భయం ఉండేది. ధైర్యం కాస్త భయంగా మారి.. భయం నుంచి పోరాటం చేయాలి.. ఈ పోరాటంలో విజయమైనా సాధించాలని.. ఇలేకపోతే ఈ ప్రాంతమే ఎడారిగా మారుతుంది. ఈ ప్రజల కోసం ఏలాగైనా ప్రజాపాలన తీసుకురావాలనే ఉక్కు సంకల్పంతోటి ఎన్ని కేసులుపెట్టినా.. అక్రమ నిర్బంధాలు చేసి, అవాంతరాలు కల్పించినా, ఒత్తిళ్లు చేసినా గుండెధైర్యంతోని కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడారు కాబట్టే ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది' అని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



