త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KP Vivekananda | అత్యంత విఫ‌ల ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి: బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద‌

KP Vivekananda | అత్యంత విఫ‌ల ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చ‌రిత్ర సృష్టించార‌ని శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్ (BRS) విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) ఎద్దేవా చేశారు. రేవంత్ చేస్తున్న ప‌నుల వ‌ల‌న ఎమ్మెల్యేలు గ్రామాల్లో ముఖం చూపెట్ట‌లేక‌పోతున్నార‌ని అన్నారు.

A

Telangana | Published On Mar 17, 2026, 11.52 am IST

KP Vivekananda | అత్యంత విఫ‌ల ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి: బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద‌
Advertisement

KP Vivekananda | త్రినేత్ర‌.న్యూస్‌ : అత్యంత విఫ‌ల ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చ‌రిత్ర సృష్టించార‌ని శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్ (BRS) విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) ఎద్దేవా చేశారు. రేవంత్ చేస్తున్న ప‌నుల వ‌ల‌న ఎమ్మెల్యేలు గ్రామాల్లో ముఖం చూపెట్ట‌లేక‌పోతున్నార‌ని అన్నారు. ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయార‌ని మండిప‌డ్డారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వ‌ద్ద వివేకానంద విలేక‌రుల‌తో మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన తొమ్మిది రోజులుకే బొక్క బోర్లా పడిందని దుయ్య‌బ‌ట్టారు. 99 రోజుల పాల‌న‌కు నిధులు లేవు, విధులు లేవ‌ని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఏ కార్య‌క్ర‌మం తీసుకున్నా అట్ట‌ర్ ఫ్లాప్‌గానే మిగిలిపోతోంద‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల కాలం అయింద‌ని గుర్తు చేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణితో కాంగ్రెస్ నేత‌లున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రేవంత్‌రెడ్డి మూటలు తీసుకెళ్లేందుకే ఢిల్లీకి వెళ్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న‌పై విశ్వాసం కోల్పోయిన ఎమ్మెల్యేలు త‌మ దారి తాము చూసుకుంటున్నార‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement