త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఎన్నిక‌ల‌ప్పుడే జెండాలు.. ఎజెండాలు : సీఎం రేవంత్‌

CM Revanth Reddy | ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడే జెండాలు, ఎజెండాలు.. మ‌న‌వాళ్ల‌ను గెలిపించుకునేందుకు మ‌న‌వాళ్ల‌ను గెలిపించుకునే ప్ర‌య‌త్నం చేద్దామ‌ని సీఎం రేవంత్ అన్నారు. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత మ‌రుక్ష‌ణం.. ఈ వేదిక‌పైనున్న అనిల్ జాద‌వ్, పాయ‌ల్ శంక‌ర్‌, గొడం న‌గేశ్ ఎవ‌రైనా కావొచ్చు.. మాకు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులే కానీ శాశ్వ‌త శ‌త్ర‌వులు కాద‌ని, వారిని శ‌త్రువులుగా భావించ‌డం లేద‌ని పేర్కొన్నారు.

P

Telangana | Published On Apr 6, 2026, 7.41 pm IST

CM Revanth Reddy | ఎన్నిక‌ల‌ప్పుడే జెండాలు.. ఎజెండాలు : సీఎం రేవంత్‌
Advertisement

CM Revanth Reddy | ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడే జెండాలు, ఎజెండాలు.. మ‌న‌వాళ్ల‌ను గెలిపించుకునేందుకు మ‌న‌వాళ్ల‌ను గెలిపించుకునే ప్ర‌య‌త్నం చేద్దామ‌ని సీఎం రేవంత్ అన్నారు. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత మ‌రుక్ష‌ణం.. ఈ వేదిక‌పైనున్న అనిల్ జాద‌వ్, పాయ‌ల్ శంక‌ర్‌, గొడం న‌గేశ్ ఎవ‌రైనా కావొచ్చు.. మాకు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులే కానీ శాశ్వ‌త శ‌త్ర‌వులు కాద‌ని, వారిని శ‌త్రువులుగా భావించ‌డం లేద‌ని పేర్కొన్నారు. సీఎం పిప్రి బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ.. 'భిన్న‌మైన ఆలోచ‌న‌లు ఉండొచ్చు. అభివృద్ధిలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అవి బేధాభిప్రాయాలు కాదు. అందుకే ఈ నాడు అభివృద్ధి ప్ర‌ణాళిక‌లో పార్టీల‌కు అతీతంగా మిత్రులంద‌రినీ పిలిపించి వారితో మాట్లాండించి.. మీ ప్రాంత స‌మ‌స్య‌ల‌ను వారు మా దృష్టికి తీసుకువ‌స్తే.. వాటిని ప‌రిష్క‌రించాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉన్నాం. ఎందుకు నేను ఈ వేదిక‌పై నుంచి ఈ మాట చెబుతున్నానంటే.. నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌లు ఆలోచ‌న చేయాలి' అన్నారు.

ప‌దేళ్ల‌లో సంస్కృతి ఉందా?

'తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన ప‌ది సంవ‌త్స‌రాల్లో ఈ సంస్కృతి ఏనాడైనా ఉన్న‌దా? ఆనాడు ముఖ్య‌మంత్రి, మంత్రులు వ‌స్తున్నారంటే.. ప్ర‌తిప‌క్షాల‌కు సంబంధించిన ఎమ్మెల్యేల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీస్‌స్టేష‌న్ల‌లో నిర్బంధించి బంజ‌రుదొడ్లో కొట్టిన‌ట్లు పోలీస్‌స్టేష‌న్ల‌లో కొట్టేవారు. ఇవాళ ఆ ప‌రిస్థితి లేదు. ఇది ప్ర‌జాస్వామిక ప‌రిపాల‌న‌. ప్ర‌జాపాల‌న‌లో ప్ర‌తిప‌క్షాల‌కు స‌హేతుక‌మైన స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తేందుకు స‌రైన అవ‌కాశం ఇవ్వాలి. శాస‌న‌స‌భ‌లో, మండ‌లిలో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తేందుకు, ప్ర‌భుత్వం నుంచి ప‌నుల‌ను సాధించుకునేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని.. చ‌ట్ట‌స‌భ‌ల్లోనే కాదు బ‌హిరంగ వేదిక‌ల్లో కూడా మా ప్ర‌తిప‌క్షాల ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను మాట్లాడిస్తున్నాను. ఈ సంప్రాదాయాన్ని తెలంగాణ‌లో కొన‌సాగించాలి. తెలంగాణ అంటే రాజ‌కీయ విలువ‌ల‌కు వేదిక‌. ఒక‌రినొక‌రు గౌర‌వించుకునే ప్రాంత‌మ‌ని ఈ దేశానికే ఆద‌ర్శంగా నిల‌బ‌డాల‌ని ఈ నాడు ఒక మంచి సంప్ర‌దాయం తీసుకున్నాం. మిత్రుడు క‌లిసి వ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌న‌న్నారు' సీఎం రేవంత్‌.

మైక్ దొరికితే చాలు..

'కొంద‌రు కొన్నిసార్లు మైకు వ‌స్తే చాలు ఏది మాట్లాడుతున్నం.. ఎందుకు మాట్లాడుతున్నం.. ఎప్పుడు మాట్లాడుతున్నం.. ఎలాంటి భాష‌వాడుతున్నమ‌నే విచ‌క్ష‌ణ కోల్పోయి.. ఏదిప‌డితే అది మాట్లాడ‌డం ద్వారా పేద‌ల‌కు, ద‌ళితుల‌కు, ఆదివాసుల‌కు, గిరిజ‌నుల‌కు అన్యాయం జ‌రుగుతుంది. విన్న‌వాడికి, మాట్లాడిన వారికి జ‌రిగే న‌ష్టం లేదు. స‌మ‌స్య‌ల‌ను ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం లేవ‌నెత్తితే.. ఈ నాటికి మంజూరు చేసిన ప్రాజెక్టులు.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు కావొచ్చు ఇచ్చిన ప‌నులు.. కాంగ్రెస్ ఎంపీలు, శాస‌న‌స‌భ్యులు లేక‌పోయినా ఈ ప్రాంతంలో పేద‌ల‌కు మేలు జ‌రుగాలి. అభివృద్ధి చేయాల‌ని రూ.1250కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు మంజూరు చేశాం. మా మిత్రులు భ‌ట్టి విక్ర‌మార్క ఉద‌యం ఫోన్ చేసి నిర్మ‌ల్‌కు కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఇవ్వాల‌ని కోరారు. రూ.200కోట్ల కేటాయించి శంకుస్థాప‌న చేసుకున్నాం. ఇందిర‌మ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రైతురుణ‌మాఫీ, రైతు భ‌రోసా, రూ.500 సిలిండ‌ర్‌, ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం ప‌థ‌కాల‌ను కాంగ్రెస్ ఓటేస్తేనే అమ‌లు చేస్తామ‌ని అన‌లేదు' అన్నారు.

ఉచిత ప్ర‌యాణానికి రూ.10వేల‌కోట్లు

'ఈ రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి ఆడ‌బిడ్డ రూ.10వేల‌కోట్ల విలువైన ఉచిత ప్ర‌యాణానికి భ‌ట్టి విక్ర‌మార్క నిధులు మంజూరు చేశారు. ఇందులో అన్నా అని పిలిచే వారు, ఇత‌ర పార్టీల‌కు న‌మ్మ‌కం, విశ్వాసం ఉన్న వారు ఉండొచ్చు. మేం పార్టీలు చూడ‌లేదు. ఆడ‌బిడ్డ‌ల క‌ష్టాలు చూశాం. ఆడ‌బిడ్డ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం ఉండాలి.. ఒక‌నాడు అమ్మ‌గారి ఇంటికి వెళ్లాల‌న్నా.. బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యానికి వెళ్లాలంటే.. ఇంటాయ‌న న‌గ‌దు ఇస్తే పోయిన‌ట్లు.. క‌సురుకుంటే క‌డుపులో దుఃఖం పెట్టుకొని అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు పోదాలేం అని ఊరుకొని ఉండొచ్చు. 2023 డిసెంబ‌ర్ 9 నాడు నాడు ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం అని చెప్పాం. 28 నెల‌లు అయ్యింది. మా అక్క‌లు సాక్షి. ఏ ఆర్టీసీ బ‌స్సుల్లోనైనా ఎవ‌రైనా బ‌స్ టికెట్ కోసం మిమ్మ‌ల్ని పైస‌లు అడిగారా? ఆదిలాబాద్ నుంచి హైద‌రాబాద్ గానీ.. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్‌.. బాస‌ర నుంచి భ‌ద్ర‌చాలం.. స‌త్య‌నారాయ‌ణ‌స్వామి గుడి నుంచి యాద‌గిరిగుట్ట ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి వెళ్లేందుకు బ‌స్సెక్కితే ఎవ‌రైనా డ‌బ్బులు అడిగారా? ఎవ‌రైనా మిమ్మ‌ల్ని బ‌స్‌లో పైస‌లు అడిగితే.. మీ త‌మ్ముడి బ్యాగులో పెట్టుకొన్రి.. మా త‌మ్ముడు ప‌ట్నంలో ఉంట‌డు. బ‌స్ కిరాయి పైస‌లు అక్క‌డ ఇస్త‌డు తీసుకుపో ఇస్త‌డ‌ని చెప్పండని చెప్పాను. నాటి నుంచి నేటి వ‌ర‌కు రూ.10వేల‌కోట్లు ప్ర‌భుత్వం ఉచిత ప్ర‌యాణానికి ఖ‌ర్చు చేసింది' అని సీఎం వివ‌రించారు.

 

 

Advertisement
Advertisement