త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | మార్కాపురం బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

Revanth Reddy | ఆంధ్ర‌ప్రదేశ్‌లోని మార్కాపురం (Markapuram) బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ప‌లువురు మంది మృతి చెంద‌డం.. కొంద‌రికి తీవ్ర గాయాల‌పాల‌వ‌డంపై సీఎం విచారం వ్య‌క్తం చేశారు.

G

Telangana | Published On Mar 26, 2026, 10.40 am IST

Revanth Reddy | మార్కాపురం బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్రదేశ్‌లోని మార్కాపురం (Markapuram) బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ప‌లువురు మంది మృతి చెంద‌డం.. కొంద‌రికి తీవ్ర గాయాల‌పాల‌వ‌డంపై సీఎం విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

బ‌స్సు నిర్మ‌ల్‌ నుంచి నెల్లూరు వైపు వెళుతున్న నేప‌థ్యంలో బ‌స్సు ప్ర‌మాదంలో మృతిచెందిన వారు.. గాయ‌ప‌డిన వారి వివ‌రాలు తెలుసుకోవాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావును ఆదేశించారు. ఏపీ అధికారుల‌తో మాట్లాడి పూర్తి వివ‌రాలు సేక‌రించాల‌ని సూచించారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం స‌హాయం అందేలా చూడాల‌న్నారు. ముఖ్య‌మంత్రి ఆదేశాల‌తో సీఎస్ రామ‌కృష్ణారావు ఏపీ సీఎస్‌తో మాట్లాడారు.

టిప్పర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయ‌వ‌రం స‌మీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉద‌యం రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. దీంతో బ‌స్సుతోపాటు టిప్ప‌ర్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. బ‌స్సు మొత్తానికి మంట‌లు వేగంగా వ్యాపించ‌డంతో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మ‌రో ముగ్గురు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతు మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది. ప‌లువురు గాయ‌ప‌డ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement