త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | రేవంత్ హిట్ల‌రే కాదు.. ఆయ‌నో తాలిబ‌న్‌

Kavitha | సీఎం రేవంత్‌రెడ్డి హిట్ల‌ర్ కంటే ఎక్కువేన‌ని.. ఆయ‌న ఓ తాలిబన్ అని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్యానించారు. విద్యాశాఖను సర్కస్ లెక్క మార్చేసిండని దుయ్య‌బ‌ట్టారు.

S

Telangana | Published On Jun 8, 2026, 12.00 pm IST

Kavitha | రేవంత్ హిట్ల‌రే కాదు.. ఆయ‌నో తాలిబ‌న్‌
Advertisement
  • అందుకే ఆడ‌పిల్ల‌ల‌కు చ‌దువు దూరం చేస్తుండు
  • విద్యా శాఖ‌ను స‌ర్క‌స్ లెక్క మార్చిండు
  • 27 వేల ప్ర‌భుత్వ స్కూళ్ల‌ను 4 వేల‌కు త‌గ్గిస్త‌ర‌ట‌
  • విద్యా శాఖ మీద ఆయ‌న‌కు ఏమాత్రం ప‌ట్టు లేదు
  • సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత ఫైర్‌

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్‌రెడ్డి హిట్ల‌ర్ కంటే ఎక్కువేన‌ని.. ఆయ‌న ఓ తాలిబన్ అని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్యానించారు. అందుకే ఆడపిల్లలు, పేదలకు చదువులు దూరం చేసేందుకు ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తమని అంటున్నారని మండిప‌డ్డారు. విద్యాశాఖను సర్కస్ లెక్క మార్చేసిండని దుయ్య‌బ‌ట్టారు. ఈమేర‌కు ఎక్స్ వేదిక‌గా సోమవారం ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

మ‌రుస‌టి రోజే ప్ర‌వేశాలు క‌ల్పించారు..

ఆడపిల్లలు, పేదలకు చదువులు దూరం చేసేందుకే ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తామని చెప్తున్నాడు. రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామంటున్నాడు. ఇలా చెప్తున్న‌ రేవంత్ రెడ్డి హిట్లర్ మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ. విద్యాశాఖపై పట్టు కోల్పోయిండు. ఆ శాఖ‌ను సర్కస్ లెక్క మార్చేసిండు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉండదు అని సీఎం ప్రకటించిన మరుసటి రోజే అడ్మిషన్లకు ఇంటర్ బోర్డు ప్ర‌వేశాలు క‌ల్పించింది అని క‌విత పేర్కొన్నారు.

డిగ్రీ అడ్మిష‌న్ల‌లో గంద‌ర‌గోళం..

జూనియర్ కాలేజీలు ప్రారంభం అయి వారం రోజులు అవుతున్నా ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఈ ప్రభుత్వం కనీసం అఫిలియేషన్‌లు ఇవ్వలేదు. డిగ్రీ అడ్మిషన్లను గందరగోళంగా మార్చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొన్ని కోర్సులను సిఫార‌సు చేస్తే.. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ మరికొన్ని కోర్సులు రిఫర్ చేసింది. వాటిలో ఏ ఒక్క కోర్సుకు కూడా యూనివర్సిటీలు అప్రూవల్ ఇవ్వలేదు. అయినా దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది అని టీఆర్ఎస్ చీఫ్ స్ప‌ష్టం చేశారు.

జీవో 7ను ర‌ద్దు చేయాలి..

గురుకులాల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయినా ఈ ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయడం లేదు. రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకే ట్యూషన్ ఫీజులు ఇస్తామన్నారు. అందుకోసం జీవో నెంబర్ 7 తీసుకువచ్చారు. ఈ జీవో కారణంగా విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు దోపిడీ చేసే ప్రమాదముంది. వెంటనే జీవో నెంబర్ 7ను రద్దు చేయాలి. ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమల్లోకి తెచ్చి ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి అని క‌ల్వ‌కుంట్ల క‌విత డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement