Maheshwar Reddy | రేవంత్ గారు.. మాతో రండి.. రైతుల గోస చూపిస్తం: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
Maheshwar Reddy | ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రైతు ఘోస- బీజేపీ భరోసా యాత్ర పేరిట పర్యటన చేస్తున్నామని.. సీఎం రేవంత్ తమతో వస్తే రైతుల గోస చూపిస్తామని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల గోస వర్ణణాతీతంగా ఉందని ఆవేదన చెందారు.
- తేళ్లకు, పాములకు భయపడకుండా పంట పండిస్తే కాంగ్రెస్ కొంటలేదు
- ఎప్పటిలోగా ధాన్యం కొంటారో సీఎం సమాధానం చెప్పాలే
- ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే రైతు గోస- బీజేపీ భరోసా యాత్ర
- మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
Maheshwar Reddy | త్రినేత్ర.న్యూస్: ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రైతు ఘోస- బీజేపీ భరోసా యాత్ర పేరిట పర్యటన చేస్తున్నామని.. సీఎం రేవంత్ తమతో వస్తే రైతుల గోస చూపిస్తామని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. భరోసా యాత్రకు బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల గోస వర్ణణాతీతంగా ఉందని ఆవేదన చెందారు. రైతులు ఎండకు ఎండి, వానకు తడిసి, తేళ్లకు, పాములకు భయపడక, కరెంటు తీగలకు భయపడక పంటను పండిస్తే నేడు అమ్ముకొనే పరిస్థితి లేదన్నారు.
రైతు వ్యతిరేక ప్రభుత్వమిది..
రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రైతు వ్యతిరేక ప్రభుత్వమిది. పండిన పంటను అమ్ముకునే పరిస్థితి లేదు. రైతులను గాలికొదిలేశారు. రైతు భరోసా, గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలు ఇలా అనేక హామీలు ఇచ్చి విస్మరించారు. ప్రభుత్వాన్ని అడుగుతున్నం. పంటను ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో చెప్పాలి. రైతులు ఎండకు ఎండి, వానకు తడిసి, తేళ్లకు, పాములకు భయపడక, కరెంటు తీగలకు భయపడక దినం రాత్రి కష్టపడ్డ రైతులు పంటను అమ్ముకొనే పరిస్థితి లేదు. ముఖ్యంగా దళారులు ఈరోజు రాజ్యం ఏలుతున్నారు అని ఏలేటి ఆరోపించారు.
మాతో రండి.. దళారులకు అమ్ముకుంటున్న పరిస్థితిని చూపిస్తం..
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల గోస వర్ణణాతీతంగా ఉంది. ఉత్తర తెలంగాణ వైపు మక్కల పంట, జొన్నల పంట, దక్షిణ తెలంగాణ వైపు వరి ఎక్కువగా పండుతుంది. పొద్దుతిరుగుడు, శనగలు ఇలా పది పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటించి, ప్రతి గింజను కొంటమని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కనీసం కొనుగోలు కేంద్రాలను నడపలేని పరిస్థితిలో ఉన్నారు. 80 శాతం కొన్నామని సీఎం చెబుతున్నారు. ఆ లెక్కలు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. మేం పర్యటిస్తున్నాం. మాతో రండి. రైతుల గోస చూడండి. దళారులకు అమ్ముకుంటున్న పరిస్థితిని మీకు చూపిస్తాం. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెబుతున్నారు. అయినా మీరు ఇప్పటికీ సగమే కొన్నారు కదా? సీఎం సమాధానం చెప్పాలి అని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రేవంత్ సమాధానం చెప్పాలి...
మరో వారం రోజుల్లో వర్షాకాలం వస్తదని రైతు బాధపడుతున్నాడు. వడ్ల కుప్పల వద్దే రైతులు చనిపోయిన సంఘటనలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. రైతులను ఎలా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తలేదు. పైగా దొంగ లెక్కలు చూపుతోంది. కాలయాపన చేస్తున్నారు. తడిసిన ధాన్యం కూడా కొనాల్సిందే. ఎప్పటిలోగా ధాన్యం కొంటారో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలి. ప్రతి గింజను కొనాలని డిమాండ్ చేస్తున్నాం అని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

అంతకుముందు తెలంగాణ రైతన్నల గోస తీర్చేందుకు.. వారి తరఫున మేమున్నాం అని భరోసా కల్పించేందుకు తెలంగాణ బీజేపీ నాయకులు రైతు భరోసా యాత్ర చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, శాసన మండలిపక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు కేవీఆర్, రాకేశ్‌రెడ్డి, డా. పాల్వయి హరీశ్ బాబు, ధన్‌పాల్ సురన్న, రామారావు పాటిల్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ బస్వా బయలుదేరి వెళ్లారు.

తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు




