త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | రేవంత్‌.. నువ్ ఎక్కిన‌ప్ప‌టి నుంచి లెక్క‌గ‌ట్టి ఇవ్వు

Ramchandar Rao | కాంగ్రెస్ త‌న మేనిఫెస్టోలో చెప్పిన ప్ర‌కారం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేత‌నం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం అందిస్తున్న రూ.3,000 గౌరవ వేతనాన్ని కూడా సమయానికి చెల్లించక‌పోవ‌డం అత్యంత దుర్మార్గం అన్నారు.

S

Telangana | Published On Jul 12, 2026, 6.57 pm IST

Ramchandar Rao | రేవంత్‌.. నువ్ ఎక్కిన‌ప్ప‌టి నుంచి లెక్క‌గ‌ట్టి ఇవ్వు
Advertisement
  • మధ్యాహ్న భోజన కార్మికులకు నెల‌కు రూ.10 వేల వేత‌నం ఇవ్వాలి
  • ఇందిరాపార్క్‌ ధ‌ర్నాచౌక్‌ ధర్నాలో రాంచంద‌ర్‌రావు డిమాండ్‌

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ త‌న మేనిఫెస్టోలో చెప్పిన ప్ర‌కారం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేత‌నం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం అందిస్తున్న రూ.3,000 గౌరవ వేతనాన్ని కూడా సమయానికి చెల్లించక‌పోవ‌డం అత్యంత దుర్మార్గం అన్నారు. నెలల తరబడి బకాయిలుగా ఉంచడం స‌రికాద‌న్నారు. ఆదివారం ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌లో నిర్వహించిన మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాలో పాల్గొని ఆయ‌న ప్ర‌సంగించారు.

రోజూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తూ ఎంతో పవిత్రమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. దాదాపు 54 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులకు నా సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నా. వారి న్యాయమైన, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. నెలకు రూ.10,000 గౌరవ వేతనం అందిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. రెండున్నరేళ్లు గడిచినా ఆ ఎన్నికల హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది అని ఆయ‌న మండిప‌డ్డారు.

మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల కోసం వారు చేస్తున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. కేవలం రెండున్నరేళ్ల పాలనలోనే కోట్ల రూపాయలను కమీషన్ల రూపంలో దోచుకునే మార్గాలు వెతికిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తన సొంత మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్ర‌కారం రూ.10,000 వేల వేత‌నం ఇవ్వాలి. వారి న్యాయమైన హక్కుల సాధన కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుంది అని రాంచంద‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు.

ఉత్త‌రం రాస్తా...

ఈ ప‌థ‌కం కేంద్రం తెచ్చింది. కార్మికుల‌ ఆర్థిక ప‌రిస్థితి ఎలా ఉన్నా ప‌ని చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా వేత‌నాలు స‌రిగా ఇయ్య‌లే. చిన్న పిల్ల‌ల‌కు అన్నం పెట్ట‌డం ప‌విత్ర‌మైన ప‌ని. పెరుగుతున్న ధ‌ర‌ల విష‌యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ప‌ది వేల వేత‌నం ఇవ్వాలి. హైద‌రాబాద్‌లో అయితే ఎన్‌జీవోల ద్వారా ఏదో చేస్తున్నారు. గుడ్డు ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న రేటు ప్ర‌కారం డ‌బ్బులు చెల్లించాలి. పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం ఇవ్వాల్సిన పైస‌లు క‌చ్చితంగా ఇవ్వాలి. కాంగ్రెస్ ఇచ్చిన‌ వాగ్దానంపై వారికే ఉత్త‌రం రాస్తాం. అధికారం రాంగ‌నే మ‌ర్చిపోతున్న‌రు. అటు రైతుల‌కు, విద్యార్థుల‌కు ఇవ్వ‌కుండా చివ‌రికి మ‌ధ్యాహ్న భోజ‌న కార్మికుల‌కు కూడా డ‌బ్బులు ఇస్త‌లేరు. రేవంత్‌రెడ్డి ప్ర‌మాణస్వీకారం చేసిన రోజు నుంచి నెల‌కు ప‌ది వేలు క‌ట్టి ఇవ్వాలి అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement