CM Revanth reddy | ఆత్మ శుద్ధి చేసుకునే పండగే రంజాన్ : సీఎం రేవంత్ రెడ్డి
రంజాన్ (Ramzan) కేవలం పండుగ కాదని.. ఆత్మ శుద్ధి చేసుకునే సమయమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అన్నారు. ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు (Iftar party) ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఎల్బీ స్టేడియం (LB Stadium) లో ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
- ఎల్బీ స్టేడియం ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
త్రినేత్ర.న్యూస్: రంజాన్ (Ramzan) కేవలం పండుగ కాదని.. ఆత్మ శుద్ధి చేసుకునే సమయమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అన్నారు. ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు (Iftar party) ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆదివారం సాయంత్రం ఎల్బీ స్టేడియం (LB Stadium) లో ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొని ప్రసంగించారు. సోదరభావం ఉండి మతసామరస్యానికి పాటుపడాలని సూచించారు. తమ ప్రభుత్వం ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. అజరుద్దీన్ కు మంత్రి పదవి, సీనియర్ నేత షబ్బీర్ అలీకి సలహాదారు, 8 మంది మైనారిటీ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అలాగే క్రికెటర్ సిరాజ్ కు డీఎస్పీ ఉదోగ్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. బాక్సర్ నికిత్ జరీన్ కు 2 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించామని వివరించారు.
మైనారిటీలకు సింహ భాగం..
ప్రభుత్వ ప్రతి కార్యక్రమంలో మైనారిటీలకు సింహభాగం ఇస్తున్నట్లు తెలిపారు. అందరం కలిసి మెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరారు. వైఎస్ హయాంలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు గుర్తు చేశారు. రిజర్వేషన్ల వల్ల అనేక మంది ఉద్యోగాలు పొందినట్లు వెల్లడించారు. ఈ ప్రభుత్వం మీది, నేను మీ సోదరుడిని. మీ ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలి అని అన్నారు. కొందరు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కలిసి మెలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





