Vem Narender Reddy | రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపిస్తా : వేం నరేందర్ రెడ్డి
Vem Narender Reddy | రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపిస్తానని వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యలను సభలో ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ.. పరిష్కరించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానని ఆయన పేర్కొన్నారు.
Vem Narender Reddy | త్రినేత్ర.న్యూస్ : రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపిస్తానని వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యలను సభలో ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ.. పరిష్కరించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న అనంతరం వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాజ్యసభకు అవకాశం కల్పించిన ఏఐసీసీ ,టీపీసీసీ పెద్దలకు కృతజ్ఞతలు. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులందరూ వెన్నంటి నిలిచి నన్ను ముందుకు నడిపారు. 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా పని చేశాను. ఇప్పటి నుంచి పార్లమెంట్ వేదికగా పని చేయబోతున్నాను. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం రాజ్యసభలో పోరాడుతాను అని వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి, నేను చాలా మంచి మిత్రులం
అసెంబ్లీ ఆవరణలో మీడియాత్ చిట్ చాట్ చేసిన వేం నరేందర్ రెడ్డి.. రేవంత్ రెడ్డి, నేను చాలా మంచి మిత్రులం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేశాను. పార్టీ కార్యకర్తగా గెలుపు కోసం పని చేశాను. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేస్తాను. నేను వివాదాలకు దూరం. ఇన్నేళ్లు నా రాజకీయా ప్రస్థానంలో ఎక్కడ కాంట్రవర్సీ కామెంట్స్ చేయలేదు.. చేయను అని వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



