త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rainwater harvesting pits | న‌గ‌రంలో ఇంకుడు గుంతల పోటీ.. రూ. 10 ల‌క్ష‌ల బ‌హుమ‌తులు ప్ర‌క‌టించిన ఆలివ్ మిఠాయి

Rainwater harvesting pits | న‌గ‌రంలో ఇంకుడుగుంత‌ల పోటీని ఆలివ్ మిఠాయి నిర్వ‌హిస్తోంది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్న ఆలివ్ మిఠాయి సంస్థ.. వర్షపు నీటిని ఆదా చేద్దాం! ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలను కాపాడుకుందాం! అనే నినాదంతో వినూత్న కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టింది.

S

Telangana | Published On Nov 19, 2026, 7.20 am IST

Rainwater harvesting pits | న‌గ‌రంలో ఇంకుడు గుంతల పోటీ.. రూ. 10 ల‌క్ష‌ల బ‌హుమ‌తులు ప్ర‌క‌టించిన ఆలివ్ మిఠాయి
Advertisement

పోటీల పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

Rainwater harvesting pits | త్రినేత్ర న్యూస్ : న‌గ‌రంలో ఇంకుడుగుంత‌ల పోటీని ఆలివ్ మిఠాయి నిర్వ‌హిస్తోంది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్న ఆలివ్ మిఠాయి సంస్థ.. వర్షపు నీటిని ఆదా చేద్దాం! ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలను కాపాడుకుందాం! అనే నినాదంతో వినూత్న కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టింది. ఆలివ్ మిఠాయి - ఇంటికో ఇంకుడు గుంత కార్యక్రమం పోస్టర్‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ బుధ‌వారం హైడ్రా కార్యాల‌యంలో ఆవిష్క‌రించారు.

వ‌ర్షాకాలం వ‌ర‌ద‌లు త‌గ్గాల‌న్నా.. వేస‌వి కాలంలో నీటి ఎద్ద‌డి నివారించాల‌న్నా ఇంకుడు గుంత‌ల ఆవ‌శ్య‌క‌త ఎంతో ఉంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఈ సంద‌ర్భంగా అన్నారు. వ‌ర్షం నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపిస్తే భూగర్భ జలాలను పెంచుకోవచ్చ‌న్నారు. ఎల్‌నినో ప్ర‌భావంతో వ‌ర్షాలు లేకున్నా.. భూగ‌ర్భ జ‌లాలు స‌మృద్ధిగా ఉంటే నీటి ఇబ్బందుల‌నుంచి చాలా వ‌ర‌కు బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు.

రూ. 10 ల‌క్ష‌ల బ‌హుమ‌తులు..

ఇంకుడు గుంత‌ను త‌వ్వి.. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో oliveforsociety పేజీకి COLLAB POST చేసి, ఫాలో చేయాల‌ని ఆలివ్ మిఠాయి సంస్థ య‌జ‌మాని దొర రాజు సూచించారు. మాకు వచ్చిన వీడియోల్లో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోలకు రూ. 10 లక్ష‌ల బ‌హుమ‌తులు అంద‌జేస్తామ‌న్నారు. Save Water! Save Earth! మరియు Tree Guard - working for green world సంస్థలు ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యమ‌య్యాయ‌న్నారు. మొద‌టి బ‌హుతికి రూ. 5 ల‌క్ష‌లు, రెండో బ‌హుతికి రూ. 3 ల‌క్ష‌లు, మూడో బ‌హుమ‌తికి రూ. 2 ల‌క్ష‌లు అంద‌జేస్తున్నామ‌న్నారు. వ‌ర్ష‌పు నీటిని ఒడిచి ప‌ట్టేలా న‌గ‌రంలో చెరువుల‌ను పున‌రుద్ధ‌రిస్తున్న హైడ్రాకు దొర రాజు ధ‌న్య‌వాదాలు తెలిపారు. న‌గ‌ర చెరువుల రూపురేఖ‌ల‌ను మారుస్తున్న హైడ్రా కూడా ఈ కార్య‌క్ర‌మానికి స‌హ‌కారం అందించాల‌ని కోరారు. బ‌హుమ‌తుల‌ను కూడా హైడ్రా క‌మిష‌న‌ర్ చేతుల మీదుగా అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement