TG Weather | తెలంగాణలో మళ్లీ వానలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..!
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుముల, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుముల, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. రాగల మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గుతాయని పేర్కొంది. అలాగే, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
గురువారం నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్ కామారెడ్డి జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని వివరించింది.
శనివారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో.. ఆదివారం పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో వింత వాతావరణం ఏర్పడుతోంది. ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా.. మరో వైపు వానలు పడుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా రికార్డవగా.. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 45.4 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ వివరించింది.
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!




