Raghava Construction | రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై నిరాధార ఆరోపణలు.. మంత్రి పొంగులేటి ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్ర
Raghava Construction | రాజేంద్రనగర్ మండలంలోని మానస హిల్స్‌లో పొంగులేటి ప్రసాద్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలను రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ తీవ్రంగా ఖండించింది.
మానస హిల్స్‌లో ఎలాంటి బ్లాస్టింగ్‌లు జరగలేదు
బీఆర్ఎస్ ఆరోపణలపై సవివరణ
Raghava Construction | త్రినేత్ర.న్యూస్ : రాజేంద్రనగర్ మండలంలోని మానస హిల్స్‌లో పొంగులేటి ప్రసాద్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలను రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం మానస హిల్స్‌లోని కంపెనీ సైట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్ఆర్‌డీసీఎల్ రోడ్స్ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ డి. గోపాలకృష్ణ, తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ యజమాని కుమార రాజా మాట్లాడారు.
ఇందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గాని, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు గానీ ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర. 2022-23లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే, బుద్వేల్‌లో 100 ఎకరాల భూమిని హెచ్ఎండీఏ వారు వేలం వేశారు. ఈ 100 ఎకరాల భూమిలో లేఔట్ డెవలప్‌మెంట్ పనుల కాంట్రాక్టును హెచ్ఎండీఏ వారు, ఎన్‌సీసీ లిమిటెడ్ కంపెనీకి అప్పగించడం జరిగింది. ఈ లేఅవుట్ చేస్తున్నప్పుడు బయటపడ్డ రాళ్లను, కోత్వాల్‌గూడలో ఆ కంపెనీ డంప్ చేయడం జరిగింది. అదే డంప్ మెటీరియల్‌ను ఇప్పుడు క్రషింగ్ చేస్తుంటే, కొత్తగా క్వారీలు తవ్వుతున్నారని అబద్ధాలు చెప్పడం సరికాదు. ఈ డంప్ చేసిన రాళ్లను ఎన్‌సీసీ లిమిటెడ్ వారు కూడా, డీకేఆర్ అనే కంపెనీ ద్వారా క్రషింగ్ చేసి హెచ్ఎండీఏ బుద్వేల్ ప్రాజెక్టులో రోడ్ పనులకు వినియోగిస్తున్నారు. అదే విధానంలో, అదే డంప్ చేసిన రాళ్లను తిరుమల మెటల్ ఇండస్ట్రీ వారు క్రష్ చేయగా ఆ మెటీరియల్‌ను రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వారు తమ రోడ్డు పనుల కోసం కొనుగోలు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ప్రదేశంలో ఎటువంటి బ్లాస్టింగ్ జరగలేదు, ఎటువంటి మైనింగ్ జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రాంతంలో ఒక్క కొత్త క్వారీకి అనుమతి ఇవ్వలేదు. వృథాగా పడి ఉన్న రాళ్లను మాత్రమే క్రషింగ్ చేయడం జరుగుతుంది. అది కూడా తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ ద్వారానే. రాఘవ కన్‌స్ట్రక్షన్‌కి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు.
రోడ్డు పనులకు సంబంధించి రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు చెల్లించే బిల్లుల్లో, అన్ని ప్రభుత్వ విధి విధానాలను అనుసరిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీని రికవరీ చేయటం జరుగుతుంది. అన్నీ పారదర్శకంగా జరుగుతుంటే 'దొంగతనం' అనడం పూర్తిగా అవాస్తవం.ఇక్కడ ఒక్క విషయం గమనించాలి.. వట్టినాగులపల్లి, కోకాపేట, అనేక ప్రాంతాల్లో ఇదే విధానంలో అనేక క్రషర్లు బీఆర్ఎస్ ప్రభుత్య హయాంలో నుండి చుట్టూ పక్కల సెల్లారు తవ్వకాలలో వచ్చిన రాళ్లను వినియోగించుకుంటున్నారు. ఆధారాలు లేకుండా మా కంపెనీ యొక్క ఇమేజ్‌ను దెబ్బతీసేలా మాట్లాడితే, న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆ కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



