KA Paul | తెలంగాణను సర్వనాశనం చేసేందుకే కవిత పార్టీ : కేఏ పాల్
KA Paul | కల్వకుంట్ల కవిత పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను సర్వనాశనం చేసేందుకే కవిత పార్టీ ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. అంతేకాదు కేవలం తండ్రితో ఉన్న గొడవ, అన్నతో ఫైట్ వల్లే ఆమె పార్టీని స్థాపించారని నిప్పులు చెరిగారు.
KA Paul | త్రినేత్ర.న్యూస్ : కల్వకుంట్ల కవిత పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను సర్వనాశనం చేసేందుకే కవిత పార్టీ ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. అంతేకాదు కేవలం తండ్రితో ఉన్న గొడవ, అన్నతో ఫైట్ వల్లే ఆమె పార్టీని స్థాపించారని నిప్పులు చెరిగారు. కవిత పార్టీపై కేఏ పాల్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీ పెట్టిందట.. నేనేమో అమెరికాలో చాలా బిజీగా ఉన్నాను. ఇరాన్ యుద్ధం ఆపకపోతే 200 దేశాల్లోని 850 కోట్ల మంది నష్టపోతారని రాత్రిపగలు ట్రంప్‌తో, స్పీకర్ మైక్ జాన్సన్‌తో లీడర్లతో చర్చలు జరిపిస్తున్నాను. ఈ లోపు మన తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేయడానికి అనేక మంది ఇంతకుముందు ఎలా పార్టీలు పెట్టారో అలాగే తెలంగాణను సర్వనాశనం చేయడానికి కవిత ఇంకో పార్టీ పెట్టింది. ఎవరు పెట్టించారు.. ఎందుకు పెట్టించారు.. ఇవన్నీ మీకు తెలుసు. అందుకే 1000 మంది ఎక్స్ ఎంపీలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. కేవలం తండ్రితో ఉన్న గొడవ, అన్నతో ఫైట్ వల్లే ఆమె పార్టీని స్థాపించారని కేఏ పాల్ అన్నారు.
రెండు మూడు కులాలే కదా.. 80 ఏండ్లుగా మన తెలుగు రాష్ట్రాలను ఏలుతున్నది..
60 శాతం ఉన్న బీసీల్లో 80 ఏండ్లలో ఒక్కడైనా సీఎం అయ్యారా..? 27 శాతం ఉన్న కాపుల్లో ఒక్కడినైనా సీఎం చేశారా..? మన దళితులు, ముస్లింలు, ఎస్టీలు గానీ, క్రిస్టియన్లను గానీ ఐదు సంవత్సరాలు ఒక్కరినైనా సీఎంను చేశారా..? ఇప్పుడున్న పార్టీలు.. 12 మంది రెడ్లు అయ్యారే. మూడు శాతం ఉన్న వారు ముగ్గురయ్యారే. మనల్ని అవ్వనివ్వరు. ఇప్పుడున్న రెండు మూడు కులాలే కదా.. 80 ఏండ్లుగా మన తెలుగు రాష్ట్రాలను ఏలుతున్నది అని కేఏ పాల్ ధ్వజమెత్తారు.
కవిత వల్ల ఎవరికీ ఒరిగేదేమీ లేదు.. నేను ఒక్కడినే అభివృద్ధి చేయగలను..
కవిత వల్ల ఎవరికీ ఒరిగేదేమీ లేదు. కేవలం తన ఫైట్ కొరకు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ ఏకం కండి. ప్రజాశాంతి పార్టీలో కులాలకు అతీతంగా చేరారు. గద్దరన్న లాంటి వారు వందల మంది ఎందుకు చేరారు. నేను ఒక్కడినే అభివృద్ధి చేయగలను. అప్పులు తీర్చగలను. కంపెనీలు తీసుకొచ్చాను. కంపెనీలు తీసుకురాగలను. ఎకనామీని డబుల్ చేయగలను. ప్రపంచంలో ఉన్న నాయకులందరూ నాకు తెలుసు. బిజినెస్ లీడర్స్ అందరూ తెలుసు. ఇప్పటి వరకు వందల కంపెనీలు తీసుకొచ్చాను. అప్పుడు చెప్పుకోలేదు.. ఇప్పుడు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన రాష్ట్రాలు బాగుపడాలి. మన దేశం బాగుపడాలి అని కేఏ పాల్ అన్నారు.
ప్రపంచ నాయకులందరూ నాతో సలహాలు తీసుకుంటున్నారు..
చైనా జీడీపీ 22 ట్రిలియన్‌కు వెళ్లిపోయింది. 37 ఏండ్ల కింద మన జీడీపీ చైనాతో సమానంగా ఉండేది. ఆరు లక్షల ఉద్యోగాలు ఇస్తానంటుంది కవిత.. అనడానికి ఏమన్న విలువ ఉందా..? కేసీఆర్ వందల మాటలు అనలేదా.. రేవంత్ రెడ్డి వందల వాగ్దానాలు చేయలేదా.. మోదీ డాలర్‌ను రూపాయిని ఈక్వల్ చేస్తానని అనలేదా.. ఇప్పుడు డాలర్ 96 అయింది. వీళ్లను నమ్మి మీరు మోసపోతారా..? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్లు అందరం ఏకమవుదమా..? మీరే నిర్ణయం తీసుకోండి. మోసపోతారా..? లేదా మోసాన్ని ఆపి వచ్చే రెండు, మూడేండ్లు అందరం ఏకమై ముఖ్యంగా యూత్.. జాబ్‌లు నేనొక్కడినే తేగలను. అప్పులు నేనొక్కడినే తీర్చగలను. అభివృద్ధి నేనొక్కడినే చేయగలను. అందుకే ఈ రోజు ట్రంప్ మొదలకుని ప్రపంచ నాయకులందరూ నాతో సలహాలు తీసుకుంటున్నారు. నాతో కూర్చుంటున్నారు. నాతో సమయం గడుపుతున్నారు ఎందుకు.. ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు కానీ ఎవరు సాల్వ్ చేయగలరు. చేయలేరు.. చేయగలిగరా..? అని కేఏ పాల్ నిలదీశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



