Praja Palana | 17న పబ్లిక్ గార్డెన్‌లో ప్రజా పాలన దినోత్సవం
Praja Palana | ఈ నెల 17న నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఏర్పాట్లపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష
Praja Palana | త్రినేత్ర.న్యూస్ : ఈ నెల 17న నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్, హైదాబాద్ సీపీ సజ్జనర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముకుందా రెడ్డితో పాటు తదితర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రజా పాలనా దినోత్సవాన్ని పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17న ఉదయం అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్‌కు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద, పబ్లిక్ గార్డెన్‌లో సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని పలు ప్రధాన భవనాలకు, చారిత్రక కట్టడాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గానూ ఈనెల 15న పూర్తి డ్రెస్ రిహార్సల్స్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రజాపాలన దినోత్సవానికి వేయి మంది స్వయం సహాయక మహిళలతో పాటు రెండు వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Couples suicide in Lalaguda | ఇంట్లో ఉరేసుకున్న భార్య.. భయపడిన భర్త ఏం చేశాడంటే..
సెప్టెంబర్ 10, 2026

Tummala Nageshwar Rao | కూరగాయల సాగుకు రూ. 125 కోట్లకు పైగా రాయితీలు
సెప్టెంబర్ 10, 2026

Talasani Srinivas Yadav | దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం చేయ్
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●డాలర్‌కు ప్రత్యామ్నాయమా? డిజిటల్ కరెన్సీల లింకేజీని భారత్ ఎందుకు ప్రతిపాదిస్తోంది?
- ●Couples suicide in Lalaguda | ఇంట్లో ఉరేసుకున్న భార్య.. భయపడిన భర్త ఏం చేశాడంటే..
- ●Tummala Nageshwar Rao | కూరగాయల సాగుకు రూ. 125 కోట్లకు పైగా రాయితీలు
- ●Talasani Srinivas Yadav | దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం చేయ్
- ●Pooja Hegde | తొలి సినిమా హీరోతో బుట్టబొమ్మ బాక్సాఫీస్ ఫైట్ - పూజా హెగ్డే శ్రీశ్రీ రిలీజ్ డేట్ ఇదేనా?
- ●Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు

డాలర్‌కు ప్రత్యామ్నాయమా? డిజిటల్ కరెన్సీల లింకేజీని భారత్ ఎందుకు ప్రతిపాదిస్తోంది?

Couples suicide in Lalaguda | ఇంట్లో ఉరేసుకున్న భార్య.. భయపడిన భర్త ఏం చేశాడంటే..

Tummala Nageshwar Rao | కూరగాయల సాగుకు రూ. 125 కోట్లకు పైగా రాయితీలు

Talasani Srinivas Yadav | దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం చేయ్



