Talasani Srinivas Yadav | దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం చేయ్
Talasani Srinivas Yadav | రాష్ట్రంలో దళిత స్పీకర్‌కు అవమానం జరిగిందని పదేపదే వ్యాఖ్యానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ డిమాండ్ చేశారు. దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సీఎంగా చేయాలని రేవంత్ రెడ్డిని తలసాని డిమాండ్ చేశారు.
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో దళిత స్పీకర్‌కు అవమానం జరిగిందని పదేపదే వ్యాఖ్యానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ డిమాండ్ చేశారు. దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సీఎంగా చేయాలని రేవంత్ రెడ్డిని తలసాని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి తలసాని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ బయట స్పీకర్ పరిధి కానే కాదు... తాతా మధు అనని మాటలను ఆయనకు ఆపాదించారు. స్పీకర్‌ను తాతా మధు అన్నట్టు నిరూపిస్తే బిఆర్ఎస్ శాసన సభ్యులు మొత్తం క్షమాపణ చెప్పేందుకు సిద్ధం.. మాకు ఎటువంటి భేషజాలు లేవు అని తలసాని పేర్కొన్నారు.
దళితుడు.. దళితుడు అనబట్టే తెలిసింది
భారతదేశ దేశ రాజకీయాల్లో రెడ్డి స్పీకర్, బీసీ స్పీకర్, దళిత స్పీకర్ అన్నట్లు చరిత్రలోనే లేదు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా గౌరవం. దళిత స్పీకర్‌గా ప్రసాద్‌కుమార్‌ను బీఆర్ఎస్ చూడలేదు. స్పీకర్ దళితుడు అని ఈ రాష్ట్ర ప్రజలకు సగం మందికి కూడా తెలియదు. ముఖ్యమంత్రి , మంత్రులు పదే పదే దళితుడు దళితుడు అనబట్టే గడ్డం ప్రసాద్ కుమార్ దళితుడని తెలిసింది అని తలసాని పేర్కొన్నారు.
స్పీకర్‌ను సీఎం చేయాలని రాహుల్‌ను వేడుకుంటున్న
దళితుడైన గడ్డం ప్రసాద్ కుమార్ వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దళితులపై ప్రేమ చూపిస్తున్న రేవంత్ రెడ్డి.. స్పీకర్‌ను సీఎంగా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. గడ్డం ప్రసాద్ కుమార్‌ను ముఖ్యమంత్రి చేయాలని రాహుల్ గాంధీని వేడుకుంటున్నానని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు
సెప్టెంబర్ 10, 2026

Vemula Prashanth Reddy | సాగు నీళ్లు లేక.. తల్లడిల్లుతున్న నిజామాబాద్ రైతులు
సెప్టెంబర్ 10, 2026

Talasani Srinivas Yadav | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులా..?
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Pooja Hegde | తొలి సినిమా హీరోతో బుట్టబొమ్మ బాక్సాఫీస్ ఫైట్ - పూజా హెగ్డే శ్రీశ్రీ రిలీజ్ డేట్ ఇదేనా?
- ●Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు
- ●Vemula Prashanth Reddy | సాగు నీళ్లు లేక.. తల్లడిల్లుతున్న నిజామాబాద్ రైతులు
- ●Talasani Srinivas Yadav | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులా..?
- ●Adilabad Khichdi Sellers Sons | ఉదయం కిచిడీ బండి.. రాత్రిళ్లు పుస్తకాలతో కుస్తీ : నీట్ క్రాక్ చేసి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన యువకులు
- ●Anupama Parameswaran | పెళ్లి బరాత్‌లో అనుపమ మాస్ స్టెప్పులు - క్రేజీ కళ్యాణం కోసం తెలంగాణ యాసలో డబ్బింగ్

Pooja Hegde | తొలి సినిమా హీరోతో బుట్టబొమ్మ బాక్సాఫీస్ ఫైట్ - పూజా హెగ్డే శ్రీశ్రీ రిలీజ్ డేట్ ఇదేనా?

Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు

Vemula Prashanth Reddy | సాగు నీళ్లు లేక.. తల్లడిల్లుతున్న నిజామాబాద్ రైతులు

Talasani Srinivas Yadav | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులా..?



