త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Bhagirath | పోక్సో కేసులో విచారణకు గైర్హాజరైన భగీరథ్.. వైరల్ లేఖపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు..

Bandi Bhagirath | పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్‌ను బుధవారం విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, సిట్ అధికారుల ఎదుట విచారణకు భగీరథ్ గైర్హాజరయ్యాడు.

P

Telangana | Published On May 13, 2026, 8.39 pm IST

Bandi Bhagirath | పోక్సో కేసులో విచారణకు గైర్హాజరైన భగీరథ్.. వైరల్ లేఖపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు..
Advertisement

Bandi Bhagirath | పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్‌ను బుధవారం విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, సిట్ అధికారుల ఎదుట విచారణకు భగీరథ్ గైర్హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం విచారణకు హాజరవుతానని, కీలక ఆధారాలు తీసుకువస్తానని పేర్కొంటూ భగీరథ్ పేరుతో ఓ లేఖ వైరల్ అవుతోంది. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, అవసరమైన సమాచారం, పత్రాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అందులో పేర్కొన్నాడు. తక్కువ సమయం ఇచ్చిన కారణంగా బుధవారం (మే 13) హాజరు కాలేకపోయానని, వ్యక్తిగత కారణాలతో విచారణకు రావడం సాధ్యపడలేదని ఆ లేఖలో ఉంది. అవసరమైన డాక్యుమెంట్లు, వివరాలు సేకరించేందుకు రెండు రోజుల గడువు ఇవ్వాలని కూడా అందులో కోరినట్లు తెలుస్తోంది.

అయితే, భగీరథ్ నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు హైదరాబాద్‌తో పాటు ముంబయి, ఢిల్లీ నగరాల్లోనూ పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. సిట్ విచారణ నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టులో భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. గురువారం ఈ పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారించే అవకాశం ఉంది. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రెండోసారి రికార్డు చేసిన అనంతరం.. ఈ కేసులో తీవ్రతరమైన పోక్సో సెక్షన్లు 5(i) రెడ్‌విత్ 6ను అదనంగా చేర్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసు విచారణ జరుగుతున్న తీరుపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. కేసును నిష్పక్షపాతంగా విచారించాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. మరోవైపు.. భగీరథ్ విచారణకు హాజరవుతాడా? బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? అన్నది ఉత్కంఠగా మారింది.

Advertisement
Advertisement