త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Case | బండి సంజయ్‌పై పీఎం సీరియస్!

POCSO Case | పోక్సో కేసు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మెడకు మెల్లగా బిగుసుకుంటున్నది. ఈ వ్యవహారంపై బీజేపీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

P

Telangana | Published On May 11, 2026, 7.07 pm IST

POCSO Case | బండి సంజయ్‌పై పీఎం సీరియస్!

బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథ్

Advertisement
  • కేసు పెట్టేందుకు నో ఆబ్జెక్షన్
  • నిన్ననే సంకేతాలు పంపిన మోదీ
  • సున్నితమైన కేసులో రివర్స్ కేసు పెట్టడం, పర్సనల్ డ్యామేజ్ కంట్రోల్ కోసం సభను వేదికగా వాడుకోవడంపై ప్రధానమంత్రి ఆగ్రహం

త్రినేత్ర.న్యూస్ : పోక్సో కేసు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మెడకు మెల్లగా బిగుసుకుంటున్నది. ఈ వ్యవహారంపై బీజేపీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో జరిగే దర్యాప్తులో తమ వైపు నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదని ఆదివారం నాడే రాష్ట్ర పోలీసు విభాగానికి.. కేంద్రం నుంచి పరోక్ష సంకేతాలు వెళ్లాయని సమాచారం.

రివర్స్ కేసు పెడతారా?

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఓ మైనర్ బాలికను అత్యాచారం చేశాడంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. బాధితులను బెదిరించేందుకు ప్రయత్నించడాన్ని బీజీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నది. ఓ వైపు బెదిరిస్తూనే మరో వైపు మైనర్ బాలిక, ఆమె తల్లిదండ్రులపై హానీ ట్రాప్ పేరుతో కరీంనగర్‌లో.. రివర్స్ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా.. బండి సంజయ్, ఆయన కుమారుడు తమ తప్పును తామే ఒప్పుకున్నట్టు అయ్యిందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నది. పైగా వారితో ఎప్పటి నుంచో సఖ్యత ఉన్నట్టు, వారికి రూ.50వేలు ఇచ్చామంటూ లిఖితపూర్వకంగా అంగీకరించడం ద్వారా పోక్సో కేసుకు అవసరమైన ఆధారాలు సమకూరినట్టేనని భావిస్తున్నది.

కేసు.. రైట్ రైట్

బండి సంజయ్ కుమారుడి అఘాయిత్యాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉన్నందున పోక్సో కేసు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడే ముఖ్యమైన నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దర్యాప్తులో పార్టీ వైపు నుంచి ఎవ్వరూ పోలీసులపై ఒత్తిడి తీసుకురావొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సమాచారం. తదనంతరం బీజేపీ తెలంగాణ చీఫ్ సోమవారం నాడు మాట్లాడుతూ బండి సంజయ్ కుమారుడి కేసుతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి వేగం పెంచాలంటూ డీజీపీని ఆదేశించడం, ఆయన వెంటనే ప్రత్యేకంగా సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement