PM Modi | తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ.. పర్యటనకు ముహూర్తం ఖరారు..!
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ మే 9న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎంఎంటీఎస్ ఫేజ్-2, బీబీనగర్ ఏయిమ్స్ ప్రారంభోత్సవాలతో పాటు పలు జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అనంతరం హైదరాబాద్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు ముహూర్తం ఖరారైంది. మే 9న రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయనున్నారు. పర్యటనలో ఎంఎంటీఎస్ ఫేజ్-2, బీబీనగర్ ఏయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్నట్లు సమాచారం. అలాగే, పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
అనంతరం హైదరాబాద్‌లోని జింఖానాగ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమానికి సైతం హాజరయ్యే అవకాశం ఉంది. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్‌లో గూగుల్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద విద్యా సహకార ప్రాజెక్టు, భారత తొలి డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని మల్లారెడ్డి కలిసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని తెలంగాణ పర్యటనకు రావడం ఇది మూడోసారి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





