త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రైతుల కోసం.. కోదాడ నుంచి హాలియా వ‌ర‌కు పాద‌యాత్ర చేస్తా : కేటీఆర్

KTR | నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.

S

Telangana | Published On Sep 3, 2026, 6.38 pm IST

KTR | రైతుల కోసం.. కోదాడ నుంచి హాలియా వ‌ర‌కు పాద‌యాత్ర చేస్తా : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మిర్యాలగూడ రైతు ధర్నా వేదికగా కేటీఆర్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

గతంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కోదాడ నుంచి హాలియా వరకు చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితో తాను కూడా పాదయాత్ర చేపడతానని కేటీఆర్ తెలిపారు. సాగర్‌లో 180 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ, సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు చుక్క నీరు కూడా విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోంది అని ఆయ‌న మండిప‌డ్డారు.

2003లో ఇలాంటి పరిస్థితులే ఏర్పడినప్పుడు కేసీఆర్ కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి, అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేశారు. అదే స్ఫూర్తితో నేడు కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరోసారి పాదయాత్ర చేపడతాను. సెప్టెంబర్ 14లోపు సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించాలి. లేకుంటే వేలాది మంది రైతులతో కలిసి పాదయాత్ర చేపడతామని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement