త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్

తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటిని వైట్ కాలర్ క్రిమినల్‌గా అభివర్ణిస్తూ, సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

J

Telangana | Published On Sep 3, 2026, 6.29 pm IST

Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్
Advertisement
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై రియల్ ఎస్టేట్, స్టోన్ క్రషర్ మాఫియా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు
  • ఏఐసీసీకి డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఫ్రాంచైజీ తెచ్చుకున్నారని విమర్శ
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సర్కస్ కంపెనీలా మారిపోయిందని, రేవంత్, పొంగులేటి కుటుంబాలు విచ్చలవిడిగా దోచుకుంటున్నాయని ఎద్దేవా
  • కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణా చర్యల విషయంలో ద్వంద్వ వైఖరి ఉందని, కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ప్రశ్న

Dasoju Sravan Press Meet | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, మంత్రుల పనితీరుపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక "సర్కస్ కంపెనీ"లా మారిపోయిందని విమర్శించారు.

పొంగులేటి ఒక రియల్ ఎస్టేట్ మాఫియా

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన ఒక వైట్ కాలర్ క్రిమినల్ అని శ్రవణ్ ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని హైదరాబాద్ చుట్టుపక్కల స్టోన్ క్రషర్, రియల్ ఎస్టేట్ మాఫియాలను నడుపుతున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా ఆయనకు చెందిన రాఘవ కంపెనీ నిర్మాణాలే కనిపిస్తున్నాయని, తన దోపిడీ ఆస్తులపై చర్చకు పొంగులేటి సిద్ధమా అని సవాల్ విసిరారు.

కవిత పేరుతో కొత్త డ్రామాలు

కాంగ్రెస్ నేతలు తమ దోపిడీని, మాఫియాను కప్పిపుచ్చుకోవడానికి కొత్తగా దొరికిన అస్త్రం కల్వకుంట్ల కవిత అని శ్రవణ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు ఇప్పటికే బహిర్గతం అయ్యాయని గుర్తు చేశారు. అసలు పొంగులేటి కాంగ్రెస్‌లో ఉన్న కవిత కోవర్టా? లేక ఆమె పార్టీలో ఏమైనా చేరుతున్నారా? అంటూ లాజికల్ ప్రశ్నలు వేశారు. కవిత బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి సొంతంగా పార్టీ నడుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి పైనా శ్రవణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏఐసీసీ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నట్లుగా, రాహుల్ గాంధీ వద్ద సీఎం పదవిని రేవంత్ కొనుక్కున్నారని ఆరోపించారు. రేవంత్ అన్నదమ్ములు, పొంగులేటి కొడుకు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్‌ను తెలంగాణ ద్రోహిగా, బీసీ ద్రోహిగా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదని సాక్షాత్తూ రేవంత్ రెడ్డి మామగారే చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

కాంగ్రెస్‌లో డబుల్ స్టాండర్డ్స్

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణా చర్యల విషయంలో ద్వంద్వ వైఖరి ఉందని శ్రవణ్ విమర్శించారు. కొండా సురేఖ, కత్తి వెంకటస్వామి లాంటి వారిపై యాక్షన్ తీసుకునే అధిష్టానం.. కోమటిరెడ్డి బ్రదర్స్, రోహిన్ రెడ్డి లాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. రేవంత్ సన్నిహితుడు రోహిన్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన ఆరోపణలకు.. సీఎం గానీ, మంత్రి పొంగులేటి గానీ సమాధానం చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు.

అధికారుల మధ్య సమన్వయ లోపం

ప్రభుత్వంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిస్థితి ఉందని శ్రవణ్ ఎద్దేవా చేశారు. రెవెన్యూ మంత్రి చెప్పకపోయినా 22A ఎత్తివేయాలని జిల్లా కలెక్టర్లు అంటున్నారని, పొంగులేటి దాష్టీకానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి ఇద్దరూ కాంగ్రెస్ పుట్టలో పాముల్లాంటి వారని ఆయన ఘాటుగా విమర్శించారు.

Advertisement
Advertisement