త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jajula Srinivas Goud | కాంగ్రెస్‌ను ప్ర‌జ‌లే బ‌ర్త‌ర‌ఫ్ చేస్తారు : జాజుల శ్రీనివాస్ గౌడ్

Jajula Srinivas Goud | బీసీ బిడ్డ కొండా సురేఖ‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం స‌రికాద‌ని బీసీ నాయ‌కుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్త‌ద‌ని, ఆ పార్టీని ప్ర‌జ‌లే బ‌ర్త‌ర‌ఫ్ చేస్తార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Sep 3, 2026, 6.18 pm IST

Jajula Srinivas Goud | కాంగ్రెస్‌ను ప్ర‌జ‌లే బ‌ర్త‌ర‌ఫ్ చేస్తారు : జాజుల శ్రీనివాస్ గౌడ్
Advertisement

Jajula Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్ : బీసీ బిడ్డ కొండా సురేఖ‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం స‌రికాద‌ని బీసీ నాయ‌కుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్త‌ద‌ని, ఆ పార్టీని ప్ర‌జ‌లే బ‌ర్త‌ర‌ఫ్ చేస్తార‌ని ఆయ‌న పేర్కొన్నారు. కొండా సురేఖ బ‌ర్త‌ర‌ఫ్‌పై శ్రీనివాస్ గౌడ్ గురువారం మీడియాతో మాట్లాడారు.

ఒక బీసీ బిడ్డ‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేస్తే గ‌త ప్ర‌భుత్వం రాజ‌కీయంగా ఎలాంటి భారీ మూల్యం చెల్లించుకుందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ భారీ రాజ‌కీయ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మ‌ల్లికార్జున ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌కి చెప్ప‌ద‌చ‌లుకున్నాం. సంబంధిత శాఖ‌లో అవినీతి పెచ్చుమిరీతే లేదా కుంభ‌కోణాలు చేస్తే, ప‌రిపాల‌న స‌రిగా లేక‌పోతే ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డితే మంత్రిని రాజీనామా కోరుతారు. రాజీనామా చేయ‌డానికి నిరాక‌రిస్తే సీఎం గ‌వ‌ర్న‌ర్ ద్వారా బ‌ర్త‌ర‌ఫ్ చేసే అవ‌కాశం ఉంటుంది. కానీ కొండా సురేఖ విష‌యంలో అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

అగ్ర కులాల మంత్రుల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసిన చ‌రిత్ర ఉందా..?

తెలంగాణ‌లో ప్ర‌శ్నించే గొంతులు ఎక్కువ‌, తిర‌గ‌బ‌డే నైజం కూడా ఎక్కువ‌. ప‌ద‌వులు ఎవ‌రికీ శావ్వ‌తం కాదు. అధికారం ఉంది క‌దా అని గ‌తంలో ఇదే ప‌ద్ధ‌తిలో ద‌ళితులు, బీసీల‌ను బీఆర్ఎస్ ప్ర‌భుత్వం బ‌ర్త‌ర‌ఫ్ చేసింది. కానీ ఇవాళ ఆ పార్టీకి, కేసీఆర్‌కు ఏ గ‌తి ప‌ట్టిందో సీఎం రేవంత్ ఆలోచించాలి. కొడంగ‌ల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్ప‌టికీ ప్ర‌శ్నించే గొంతుక అని మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా గెలిపించారు. ప్ర‌శ్నించే వారికి తెలంగాణ స‌మాజం నైతికంగా మ‌ద్ద‌తు ఇస్తుంది. బీసీల‌ను రాజ‌కీయంగా బ‌లి చేస్తానంటే కేసీఆర్‌కు ఏ గ‌తి ప‌ట్టిందో మ‌న క‌ళ్ల ముందు చూస్తున్నాం. అగ్ర కులాల మంత్రుల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసిన చ‌రిత్ర ఉందా..? బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డ‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేస్తారు.. ప్ర‌జ‌లు మిమ్మ‌ల‌ను బ‌ర్త‌రఫ్ చేస్తారు. కాబ‌ట్టి తొంద‌ర‌పాటు చ‌ర్య‌లు వ‌ద్దు.. బీసీ బిడ్డ‌ల జోలికి రావొద్దు.. దాని ప‌ర్య‌వ‌స‌నం తీవ్రంగా ఉంటుంది అని ఆయ‌న హెచ్చ‌రించారు.

రేవంత్ రెడ్డి బీసీల‌తో పెట్టుకోవ‌ద్దు.. కొండా సురేఖ‌ ఒంట‌రి కాదు

తెలంగాణ‌లో బీసీ జ‌నాభా 60 శాతం ఉంది. రాజ‌కీయంగా 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తామన్నారు. ఆ విధంగా చూసుకుంటే కేబినెట్‌లో 60 శాతం మంత్రి ప‌ద‌వులు బీసీల‌కు ఉండాలి. కానీ ముగ్గురు బీసీల్లో ఒక‌రిని బ‌ర్త‌ర‌ఫ్ చేశారు. బీసీల‌కు ప‌శువుల శాఖ‌, అడ‌వుల శాఖ‌, బీసీ శాఖ ఇచ్చారు. రెడ్ల‌కు మాత్రం రెవెన్యూ శాఖ‌, ఆర్ అండ్ బీ శాఖతో పాటు కీల‌క శాఖ‌లు క‌ట్ట‌బెట్టారు. రేవంత్ రెడ్డి బీసీల‌తో పెట్టుకోవ‌ద్దు.. రాజ‌కీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్త‌ది.. కొండాసురేఖ‌కు బీసీ స‌మాజం అండ‌గా ఉంట‌ది.. ఆమె ఒంట‌రి కాదు. బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం మంచిది కాదు. బ‌ర్త‌ర‌ఫ్ చేయొద్దు.. చేస్తే చ‌రిత్ర పున‌రావృత‌మైత‌ది అని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement