త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prabhakar Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌భాక‌ర్‌రావుకు ఊర‌ట‌.. ముంద‌స్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!

Prabhakar Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్‌, మాజీ ఐపీఎస్ అధికారి టీ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్త‌ర్వులు ఇచ్చింది.

P

Telangana | Published On Mar 10, 2026, 8.44 pm IST

Prabhakar Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌భాక‌ర్‌రావుకు ఊర‌ట‌.. ముంద‌స్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!
Advertisement

Prabhakar Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్‌, మాజీ ఐపీఎస్ అధికారి టీ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్త‌ర్వులు ఇచ్చింది. మంగళవారం జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాద‌న‌లు వినిపించారు. ఈ కేసు దర్యాప్తు దాదాపు పూర్తయిందని కోర్టుకు తెలిపారు.

త్వరలోనే ప్రభాకర్ రావుపై అదనపు చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తాను దర్యాప్తుకు పూర్తిగా సహకరించానని, కోర్టు ఆదేశాలను అన్ని విధాలుగా పాటించానని ప్రభాకర్ రావు ధర్మాసనానికి తెలిపారు. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూనే, అరెస్ట్ నుంచి మిన‌హాయింపు ఇచ్చి ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ సంద‌ర్భంగా కోర్టు ప‌లు ష‌ర‌తులు విధించింది. సిట్ విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని, కేసులో సాక్ష్యాల‌ను, ఆధారాల‌ను తారుమారు చేసే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని చెప్పింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే బెయిల్ ర‌ద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించింది.

కోర్టు అనుమ‌తి లేకుండా రాష్ట్రం, దేశం విడిచి వెళ్లొద‌ని స్ప‌ష్టం చేసింది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్రతిపక్ష నేత‌ల‌తో పాటు ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ ఫోన్ల‌ను అక్ర‌మంగా ట్యాప్ చేశార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చాక కేసు న‌మోదు చేసి విచార‌ణ ప్రారంభించారు. అప్ప‌ట్లో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న ప్రభాకర్ రావు పర్యవేక్షణలోనే ఫోన్ ట్యాపింగ్ సాగిన‌ట్లుగా సిట్ గుర్తించింది. ఇదే కేసులో ప్రణీత్ రావు, రాధాకిషన్‌రావు త‌దిత‌ర ఉన్న‌తాధికారులు విచార‌ణ ఎదుర్కొంటున్నారు. గ‌తంలో తెలంగాణ హైకోర్టు ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించ‌గా.. ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

Advertisement
Advertisement