Jagga Reddy | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం.. సీఎం రేవంత్ చెప్పింది నిజమే : జగ్గారెడ్డి
Jagga Reddy | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజమే అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర ఇది అని మండిపడ్డారు.
Jagga Reddy | త్రినేత్ర.న్యూస్ : డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజమే అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర ఇది అని మండిపడ్డారు.
నియోజక వర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు నష్టపోతాయి. దక్షిణాదికి రాజకీయ ఉనికి లేకుండా కుట్ర జరుగుతుంది. బీజేపీ మంత్రులు ఏం చేయలేరు..? మాట్లాడలేరు. కాంగ్రెస్ పార్టీలో అయితే సోనియా గాంధీకి చెప్పుకునే స్వాతంత్య్రం ఉండేది. బీజేపీలో అలాంటి అవకాశమే ఉండదు. బండి సంజయ్ ఏమట్లాడినా విలువ ఉండదు. ఆయన విమర్శలను సీరియస్‌గా తీసుకోవాల్సి అవసరం లేదు. అధికార పార్టీ మీద ప్రతిపక్షం ఆరోపణలు చేయడం సహజం. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చెప్పడం సహజం అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
రెండున్నరయేండ్లలో సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా భూమి నేను తీసుకున్నట్టు, ఇన్వాల్వ్ అయినట్టు మీకు సమాచారం ఉందా..? అని అడిగారు పొంగులేటి. నా జిల్లాలో భూమి ముట్టుకోవడానికి నాకే వీలు లేకుండా పోతుంది.. ఇంకా పొంగులేటికి ఎక్కడ దొరుకుతుంది. నా జిల్లాలో ఎలాంటి ఆరోపణలు లేవని సర్టిఫికెట్ ఇచ్చిన. నాకు ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసే అలవాటు లేదు. ఒక్కో ఎకరం కొల్లూరు.. ఉస్మాన్‌పూర్ పోతే ఎకరానికి రూ. 20 కోట్లు. ఎవరు వేలు పెట్టినా భగ్గుమంటదని ఆయన తెలిపారు.
మళ్ళీ హరీష్ రావు ఆరోపణలు చేస్తే.. వాళ్ళు ఏం చేశారో బయటా పెడతా. పటాన్‌చెరులో ఎవరు దందా చేశారో చెప్తా. 2014 నుండి మూడేళ్లు జగ్గారెడ్డి ఎక్కడైనా భూములు సంపాదించాడా అని వెతికారు. జల్లెడ పట్టినా.. ఏం దొరకలేదు. భూములు దొరకలేదు. ఆస్తులు చూశారు.. ఊర్లో ఇల్లు లేదు అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



