Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?
Harish Rao | బియ్యమే కాకుండా ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240, పల్లినూనె రూ.210, పెసరపప్పు రూ.125, కందిపప్పు రూ.165.. ఇలా అడ్డగోలుగా ధరలు పెరిగితే సామాన్య కుటుంబం ఎలా బతకాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు.
- వంటింటి బడ్జెట్ తారుమారవువుతన్నా పౌరసరఫరాల శాఖ ఏం చేస్తుంది?
- ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గాలి కదా?
- వెంటనే తనిఖీలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
- మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
Harish Rao | త్రినేత్ర న్యూస్: బియ్యమే కాకుండా ఉల్లి రూ.70, ఎల్లిపాయ రూ.240, పల్లినూనె రూ.210, పెసరపప్పు రూ.125, కందిపప్పు రూ.165.. ఇలా అడ్డగోలుగా ధరలు పెరిగితే సామాన్య కుటుంబం ఎలా బతకాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. వంటింటి బడ్జెట్ తారుమారవుతున్నా.. పౌరసరఫరాల శాఖ ఏం చేస్తోందని నిలదీశారు. ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం ఆపి.. వెంటనే అధిక మార్జిన్లపై తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
సన్నబియ్యం ధరలు 25 శాతం పెరిగితే కనిపిస్తలేదా?
నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణం. ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారు. సన్నబియ్యం ధరలు కేవలం నాలుగు నెలల్లోనే 25 శాతం పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా? రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం.. మరి ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి.. బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయి?
మీరు ఇస్తున్న సన్నబియ్యం పథకం సఫలమైతే, ఎందుకు బియ్యం ధరలు అదుపు తప్పుతున్నాయి? మీరు ఇస్తున్న నాణ్యత లేని సన్నబియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా? ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు MSP పేరిట దక్కుతున్నది నామమాత్రపు ధర. కానీ మధ్య దళారులుకు దక్కుతున్నది క్వింటాకు రూ.8000పై మాటే.
లాభపడుతున్నది దళారులే
రైతుకు గిట్టుబాటు ధర లేదు.. వినియోగదారుడికి అందుబాటు ధర లేదు.. లాభపడుతున్నది మాత్రం మధ్య దళారులు? కళ్ళ ముందే ఈ తతంగం అంతా జరుగుతుంటే ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు? ధరల పర్యవేక్షణ గాలికి వదిలేసి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక మార్జిన్లపై తక్షణం నిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. సన్నబియ్యం సహా నిత్యావసరాల ధరలకు వెంటనే అడ్డుకట్ట వేసి, సామాన్యుడిపై పడుతున్న భారం నుండి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్
అక్టోబర్ 5, 2026

Suicide attempt at Bheemgal PS | భీమ్‌గల్ పీఎస్‌లో నిప్పంటించుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే
అక్టోబర్ 5, 2026

Tammineni Veerabhadram | రేవంత్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం భ్రమ: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..
- ●IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..
- ●CEC Gyanesh Kumar | జ్ఞానేశ్‌ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
- ●Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్
- ●Maruti Suzuki | మారుతి షేర్లకు భారీ కరెక్షన్.. 34 శాతం పతనం తర్వాత మళ్లీ పుంజుకుంటుందా?
- ●Supreme Court | నేరస్థుల్లో భయం పుట్టించాలి.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..

IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..

CEC Gyanesh Kumar | జ్ఞానేశ్‌ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు

Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్



