V Srinivas Goud | పదేళ్లలో పాలమూరును అభివృద్ధి పథంలో నడిపించాం: శ్రీనివాస్ గౌడ్
V Srinivas Goud | తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ వైద్య విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన ఆయన.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని వారితో కలిసి ఆవిష్కరించారు.
V Srinivas Goud | తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ వైద్య విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన ఆయన.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని వారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు పాలమూరు జిల్లా ఆకలి కేకలు, వలసలకు మారుపేరుగా ఉండేదని గుర్తుచేశారు. సాగునీరు అందక వ్యవసాయం సంక్షోభంలో పడటంతో తల్లిదండ్రులు పిల్లలను ఇళ్ల వద్దే వదిలి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొన్నామని పేర్కొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి
తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం మహబూబ్‌నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేశామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాకు వైద్య కళాశాలలు, గురుకులాలను తీసుకురావడంతో పాటు రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు అందించామని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అమర్‌రాజా పరిశ్రమ, ఐటీ టవర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రహదారుల విస్తరణ, బైపాస్ నిర్మాణం వంటి పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ సమయంలో స్థలాన్ని పరిశీలించిన కొందరు.. నిర్మాణానికి చాలా ఏళ్లు పడుతుందని అభిప్రాయపడ్డారని గుర్తుచేశారు. అయితే ఏడాదిలోనే నిర్మాణ పనులను దాదాపుగా పూర్తి చేయగలిగామని చెప్పారు. దేశంలోనే అత్యధిక వైశాల్యం కలిగిన పార్క్ మహబూబ్‌నగర్‌లో ఉందని తెలిపారు.
12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి
ఉద్దండాపూర్, కర్వెన రిజర్వాయర్ల పనులను పూర్తి చేశామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. వాటికి సంబంధించిన కాలువల నిర్మాణం పూర్తయితే సుమారు 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం నిలిచిపోయిన ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులను ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. ఏదైనా నిర్మాణం చేపట్టే ముందు ప్రణాళికలు, ప్రభుత్వ అనుమతులు, అవసరమైన ఇతర అంశాలను పరిశీలించి పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించారు. సగంలో నిలిచిపోయిన నిర్మాణాలకు పైపైన పనులు చేసి, రేకులు వేసి, రంగులు అద్దితే అభివృద్ధి జరిగినట్లు కాదని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉపయోగపడేలా పనులను పూర్తిస్థాయిలో చేపట్టాలని అన్నారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించాలి
జిల్లాలో నిర్మాణం పూర్తయిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మన్యంకొండ రోప్‌వే పనులు నిలిచిపోయాయని, ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులను కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం రైతులు విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారని, సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌తో పాటు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాకు తొలి వైద్య కళాశాలను మంజూరు చేసిన కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Navaratri Brahmotsavams | బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి వైభవం.. భక్తిపారవశ్యంలో తిరుమల
- ●Nandamuri Tejaswini | చిరంజీవి కాకాలో బాలకృష్ణ కూతురు - మలయాళ హీరోయిన్ ప్లేస్‌లో...
- ●N Ramchander Rao | ఓవైపు కరవుతో రైతులు ఇబ్బందులు పడుతుంటే.. కేబినేట్ సమావేశం రద్దు చేసి ఢిల్లీకి వెళ్లిన సీఎం
- ●Tirumala Brahmotsavam | స్వర్ణకాంతులతో మలయప్ప.. పెద్దశేష వాహనంపై దివ్య దర్శనం
- ●Harish Rao Father in Law | హరీష్‌రావు మామకు హైకోర్టులో ఊరట: బలవంతంగా ఖాళీ చేయించొద్దు
- ●Terrorists Killed | ఎల్ఓసీ దాటే యత్నం.. ల్యాండ్‌మైన్ పేలి నలుగురు ఉగ్రవాదులు హతం!

Navaratri Brahmotsavams | బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి వైభవం.. భక్తిపారవశ్యంలో తిరుమల

Nandamuri Tejaswini | చిరంజీవి కాకాలో బాలకృష్ణ కూతురు - మలయాళ హీరోయిన్ ప్లేస్‌లో...

N Ramchander Rao | ఓవైపు కరవుతో రైతులు ఇబ్బందులు పడుతుంటే.. కేబినేట్ సమావేశం రద్దు చేసి ఢిల్లీకి వెళ్లిన సీఎం

Tirumala Brahmotsavam | స్వర్ణకాంతులతో మలయప్ప.. పెద్దశేష వాహనంపై దివ్య దర్శనం





