Handloom Shawls | భక్తులకు చేనేత శాలువాలనే ఇవ్వండి.. మంత్రి కొండా సురేఖకు గజం అంజయ్య విజ్ఞప్తి
Handloom Shawls | తెలంగాణలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అందించే శాలువాలు ఇకపై చేనేతతో తయారైనవే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం జూబ్లిహిల్స్‌లోని నివాసంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
Handloom Shawls | తెలంగాణలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అందించే శాలువాలు ఇకపై చేనేతతో తయారైనవే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం జూబ్లిహిల్స్‌లోని నివాసంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు స్వచ్ఛమైన నూలుతో తయారు చేసిన శాలువాతో మంత్రిని సత్కరించారు. ఆలయాల్లో చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యం, వాటి సాంస్కృతిక విలువపై అంజయ్య మంత్రికి వివరించారు. యాదాద్రి, భద్రాచలం, బాసర, వేములవాడ వంటి రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సేవల సమయంలో భక్తులకు అందిస్తున్న శాలువాలు ప్రస్తుతం పెద్దఎత్తున మరమగ్గాలు, మిల్లుల్లో తయారైన కృత్రిమ నూలు ఉత్పత్తులతో వస్తున్నాయని ఆయన తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తున్న సందర్భంలోనే సింథటిక్ నూలుతో తయారైన శాలువాల వినియోగాన్ని కొనసాగించడం సరైందని కాదన్నారు. దేవాలయాల్లో భక్తులకు అందించే శాలువాలు పత్తి లేదా పట్టు చేనేతతో తయారైతే వాటికి మరింత ఆధ్యాత్మికత, సంప్రదాయ విలువ చేకూరుతుందని అంజయ్య పేర్కొన్నారు. ఇదే విధానం కొనసాగితే రాష్ట్రంలోని వేలాది మంది చేనేత కార్మికులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, చేనేత సంప్రదాయ పరిరక్షణకు ఇది దోహదపడుతుందని ఆయన మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో చేనేత శాలువాల వినియోగాన్ని తప్పనిసరిగా ప్రోత్సహించేలా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
అంజయ్య చేసిన సూచనలు, ప్రతిపాదనలను మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్వీకరించారు. చేనేత రంగ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భారతీయ సంప్రదాయాల సంరక్షణలో చేనేత కార్మికుల పాత్ర అమూల్యమని మంత్రి వ్యాఖ్యానించారు. ఆలయాల్లో చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ పరిరక్షణతో పాటు కార్మికుల జీవనోపాధికి కూడా బలం చేకూరుతుందని ఆమె తెలిపారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. చేనేత రంగ పురోగతికి, చేనేత కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కొండా సురేఖ స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Muharram | మొహర్రం వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
జూన్ 9, 2026

Minister Adluri Laxman Kumar | హిట్లర్ ఎవరో.. హితుడు ఎవరో తెలుసుకో.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ లేఖ
జూన్ 9, 2026

Minister Sridhar Babu | పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు: మంత్రి శ్రీధర్‌బాబు
జూన్ 9, 2026
తాజావార్తలు
- ●Minister Adluri Laxman Kumar | హిట్లర్ ఎవరో.. హితుడు ఎవరో తెలుసుకో.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ లేఖ
- ●Minister Sridhar Babu | పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు: మంత్రి శ్రీధర్‌బాబు
- ●Rajya Sabha Polls | కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- ●Nayanthara | నయనతార పెళ్లి రోజు - రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన డైరెక్టర్
- ●Chandrayangutta | హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి
- ●Solar Power | నీటిపారుదల భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

Minister Adluri Laxman Kumar | హిట్లర్ ఎవరో.. హితుడు ఎవరో తెలుసుకో.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ లేఖ

Minister Sridhar Babu | పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు: మంత్రి శ్రీధర్‌బాబు

Rajya Sabha Polls | కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ

Nayanthara | నయనతార పెళ్లి రోజు - రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన డైరెక్టర్



