త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osmania University PhD Entrance Test | న‌వంబ‌ర్ 14 నుంచి ఉస్మానియా యూనివ‌ర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రెన్స్ ప‌రీక్ష‌లు

Osmania University PhD Entrance Test | ఉస్మానియా యూనివ‌ర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రెన్స్( Osmania University PhD Entrance Test )తేదీలు ఖ‌రారు అయ్యాయి. ఈ మేర‌కు ఓయూ డైరెక్ట‌రేట్ ఆఫ్ అడ్మిష‌న్స్ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ ఐ పాండురంగారెడ్డి ఆదివారం అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

S

Telangana | Published On Oct 18, 2026, 7.08 pm IST

Osmania University PhD Entrance Test | న‌వంబ‌ర్ 14 నుంచి ఉస్మానియా యూనివ‌ర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రెన్స్ ప‌రీక్ష‌లు
Advertisement

Osmania University PhD Entrance Test | త్రినేత్ర న్యూస్ : ఉస్మానియా యూనివ‌ర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రెన్స్( Osmania University PhD Entrance Test )తేదీలు ఖ‌రారు అయ్యాయి. ఈ మేర‌కు ఓయూ డైరెక్ట‌రేట్ ఆఫ్ అడ్మిష‌న్స్ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ ఐ పాండురంగారెడ్డి ఆదివారం అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

మొత్తం 53 సబ్జెక్టుల‌కు పీహెచ్‌డీ ప్ర‌వేశ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఇందుకు సంబంధించిన రాత‌ప‌రీక్ష‌ల‌ను న‌వంబ‌ర్ 14 నుంచి 16వ తేదీ నిర్వ‌హిస్తామ‌న్నారు. రోజుకు మూడు సెష‌న్ల చొప్పున ప‌రీక్ష‌లు ఉంటాయ‌న్నారు. ఇక న‌వంబ‌ర్ 10వ తేదీ నుంచి హాల్ టికెట్లు ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌న్నారు.

పీహెచ్‌డీ ఎంట్రెన్స్ టెస్ట్.. కంప్యూర్ బేస్డ్ విధానంలో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌లోనే ప‌రీక్షా కేంద్రాలు ఉంటాయ‌న్నారు. అభ్య‌ర్థులు ప‌రీక్ష స‌మ‌యానికి 90 నిమిషాల ముందే.. కేంద్రాల‌కు చేరుకుని రిపోర్టింగ్ చేయాల‌ని సూచించారు.

Advertisement
Advertisement