త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Devi Prasad | ‘వెలుగు’ కట్టు కథలు ప్ర‌చురించ‌డం దుర్మార్గం: దేవీప్రసాద్

Devi Prasad | వెలుగు ప‌త్రిక‌ కట్టు కథలను ప్ర‌చురించ‌డం దుర్మార్గమ‌ని.. వెంట‌నే ఉపసంహరించుకోవాల‌ని బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Oct 18, 2026, 6.28 pm IST

Devi Prasad | ‘వెలుగు’ కట్టు కథలు ప్ర‌చురించ‌డం దుర్మార్గం: దేవీప్రసాద్
Advertisement

Devi Prasad | త్రినేత్ర న్యూస్: వెలుగు ప‌త్రిక‌ (Velugu News Paper) కట్టు కథలను ప్ర‌చురించ‌డం దుర్మార్గమ‌ని.. వెంట‌నే ఉపసంహరించుకోవాల‌ని బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులపై వెలుగు పత్రిక చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. 15 టీఎంసీల‌ సామర్థ్యం ఉన్న‌ కొండపోచమ్మ సాగర్ (Kondapochamma Sagar) కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్‌ కోసమే అని కథనాన్ని ప్రచురించడం రేవంత్ రెడ్డి మాట వెలుగు బాటగా మారిందని ప్రజలు భావిస్తున్నార‌న్నారు. ఆదివారం ఆయ‌న మాట్లాడారు.

కొండ పోచమ్మ సాగర్ నిర్మాణం వల్ల‌ వందలాది గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ పెరిగి లక్షల ఎకరాలకు, పరోక్షంగా లక్షకు పైగానే ప్రత్యక్షంగా సాగునీరు అందుతున్నది. వేల ఎకరాల భూమి కబ్జా చేసుకున్నారని చేసిన ఆరోపణలు తప్పు అని తేలిపోయిన నేపథ్యంలో కేసీఆర్ ప్రతిష్ట దెబ్బ తీసేలా పరిశోధన జర్నలిజం పేర కట్టు కథలు అల్లి ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల పెరుగుతున్న ఆదరణను దూరం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగానే కథనాలు ప్రచురిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సాగునీటి అవసరాల కోసం నిర్మాణం అయిన కాలువల మార్గాలను కేసీఆర్ పొలాల కోసమే అని చిత్రీకరించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనే అనుమానాలు కలుగుతున్నాయి.

అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల కోపాన్ని పక్కదారి పట్టించడానికి డైవర్షన్ డ్రామాగా ప్రాజెక్ట్ లపై, బీఆర్ఎస్ అధినేతపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఎల్‌నినో వల్ల‌ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో చతికిలపడిపోయిన ప్రభుత్వం. వెలుగు పేపర్ ద్వారా అబద్ధపు ప్రచారాన్ని చేయడం సిగ్గుచేటు. వెంటనే ఆ కథనాన్ని ఉపసంహరించుకోవాలి అని దేవీ ప్ర‌సాద్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement