BRS Switzerland | పత్రికా స్వేచ్ఛంటే నిరాధార ఆరోపణలు చేసే లైసెన్స్ కాదు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ నేత శ్రీధర్ గందె
BRS Switzerland | పత్రికా స్వేచ్ఛ అంటే నిరాధార ఆరోపణలు చేసే లైసెన్స్ కాదని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ నాయకులు శ్రీధర్ గందె (Sridhar Gande) అన్నారు.
BRS Switzerland | త్రినేత్ర న్యూస్: పత్రికా స్వేచ్ఛ అంటే నిరాధార ఆరోపణలు చేసే లైసెన్స్ కాదని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ నాయకులు శ్రీధర్ గందె (Sridhar Gande) అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రతిష్ఠను దెబ్బతీసేలా, తెలంగాణ సాగునీటి జీవనాడి అయిన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుపై 'వెలుగు' దినపత్రిక (Velugu News Paper) ప్రచురించిన నిరాధార కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ జారీ చేసిన నోటీసుల (Notices)కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు. ఆర్టికల్ 19(2) ప్రకారం ఆ స్వేచ్ఛకు సహేతుకమైన పరిమితులు, బాధ్యత ఉంటాయి. కనీస అధికారిక ఆధారాలు, సాగునీటి శాఖ రికార్డుల పరిశీలన లేకుండా.. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఒక వ్యక్తి ప్రతిష్ఠకు భంగం కలిగించడం ముమ్మాటికీ 'పరువు నష్టం' (Defamation - BNS Section 356) పరిధిలోకే వస్తుంది. ఇది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన జర్నలిజం నైతిక ప్రమాణాలను (Norms of Journalistic Conduct) ఉల్లంఘించడమే.
ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి అసత్య కథనాలను 24 గంటల్లోగా ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నిజ నిర్ధారణ లేని ఇటువంటి దుష్ప్రచారాలను చట్టపరంగానే ఎదుర్కొంటాం అని శ్రీధర్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

BRS Denmark | వెలుగు పత్రిక తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
అక్టోబర్ 18, 2026

Gurrala Nagaraju | ఆధారాలుంటే బయటపెట్టండి… కేసీఆర్‌పై బురదజల్లడం ఆపండి!
అక్టోబర్ 18, 2026

Brother and Sister Die in Road Accident | దసరాకు చెల్లిని పుట్టింటికి తీసుకొస్తుండగా ప్రమాదం.. అన్నాచెల్లెళ్లు స్పాట్ డెడ్
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●BRS Denmark | వెలుగు పత్రిక తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●Sridevi | శ్రీదేవి కోసం చూడాల్సిన సినిమా - "హైకూ"పై కోన వెంకట్ కామెంట్స్
- ●Pakistan Airspace Ban India | భారత్‌పై పాకిస్తాన్ మరోసారి అక్కసు: భారత విమానాలపై గగనతల నిషేధం పొడిగింపు
- ●Gurrala Nagaraju | ఆధారాలుంటే బయటపెట్టండి… కేసీఆర్‌పై బురదజల్లడం ఆపండి!
- ●Navaratri Brahmotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో పద్మావతి అమ్మవారు ఎందుకు కనిపించరు?
- ●Meta AI | ఆ వివాదంలో మెటా యూటర్న్.. వెబ్సైట్ల కంటెంట్‌పై కీలక వివరణ!

BRS Denmark | వెలుగు పత్రిక తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

Sridevi | శ్రీదేవి కోసం చూడాల్సిన సినిమా - "హైకూ"పై కోన వెంకట్ కామెంట్స్

Pakistan Airspace Ban India | భారత్‌పై పాకిస్తాన్ మరోసారి అక్కసు: భారత విమానాలపై గగనతల నిషేధం పొడిగింపు

Gurrala Nagaraju | ఆధారాలుంటే బయటపెట్టండి… కేసీఆర్‌పై బురదజల్లడం ఆపండి!



