త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | కాంగ్రెస్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే.. కేసీఆర్‌పై త‌ప్పుడు క‌థ‌నాలు

Manne Krishank | కాంగ్రెస్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నార‌ని ఆ పార్టీ నాయ‌కుడు మ‌న్నె క్రిశాంక్ మండిప‌డ్డారు. కేసీఆర్‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన వెలుగు దిన‌ప‌త్రిక‌తో పాటు వీ6 చానెల్ 24 గంట‌ల్లో బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని క్రిశాంక్ డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Oct 18, 2026, 6.59 pm IST

Manne Krishank | కాంగ్రెస్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే.. కేసీఆర్‌పై త‌ప్పుడు క‌థ‌నాలు
Advertisement

వెలుగు క‌థ‌నంపై బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్ ఫైర్

Manne Krishank | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నార‌ని ఆ పార్టీ నాయ‌కుడు మ‌న్నె క్రిశాంక్ మండిప‌డ్డారు. కేసీఆర్‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన వెలుగు దిన‌ప‌త్రిక‌తో పాటు వీ6 చానెల్ 24 గంట‌ల్లో బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న వీడియో సందేశం ఇచ్చారు.

సూప‌ర్ ఎల్ నినోను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ స‌ర్కార్ పెద్ద ప‌రిష్కారం కొన‌గున్న‌ది. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మ‌ళ్లిన కొండ‌పోచ‌మ్మ అని కేసీఆర్ పొలం వైపు డైవ‌ర్ట్ చేస్తున్నారు. 22ఏపై బీఆర్ఎస్ ప్ర‌శ్నిస్తే.. స‌మాధానం చెప్ప‌కుండా కేసీఆర్ భూములు, ఆస్తులు అని డైవ‌ర్ట్ చేశారు. ఎల్ నినో గురించి ఏప్రిల్‌లోనే శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రించారు. తాగు, సాగునీటి స‌మ‌స్య ఉంట‌ద‌ని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి అక్టోబ‌ర్‌లో నిద్ర లేచి రివ్యూ చేప‌ట్టారు. గోదావ‌రి నీళ్లు ఎందుకు ఎత్తిపోయ‌లేదు అని అంద‌రూ ప్ర‌శ్నిస్తుంటే.. ఇప్పుడు దాన్ని డైవ‌ర్ట్ చేయ‌డానికి కొండ‌పోచ్చ‌మ్మ సాగ‌ర్ నుంచి కేసీఆర్ పొలానికి నీళ్లు వెళ్తున్నాయ‌ని మంత్రి వివేక్ ప‌త్రిక వెలుగు, వీ6 చానెల్‌లో నిర్ధార‌ణ లేకుండా కాంగ్రెస్ మంత్రులు ఫేక్ స్టోరీల‌ను ప్ర‌చారం చేయిస్తున్నార‌ని క్రిశాంక్ మండిప‌డ్డారు.

ప్రస్తుతం రాష్ట్రం చేయాల్సింది ప్ర‌తిప‌క్షాల‌ మీద నెట్ట‌డం కాదు. ఎట్ల సాగు, తాగునీరు అందించాల‌ని ఆలోచించి ప‌ని చేయ‌డండి. ఎప్పుడు ఫేక్ స్టోరీలేనా..? గ‌తంలో కొండా సురేఖ త‌ప్పుగా మాట్లాడితే.. క్ష‌మాప‌ణ‌లు చెప్పే ప‌రిస్థితి వ‌చ్చింది. కేటీఆర్ పాస్‌పోర్ట్ జ‌ప్టు అని ఓ ప‌త్రిక రాస్తే.. వారు కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ లీగ‌ల్ సెల్ వెలుగు దిన‌ప‌త్రికకు లీగ‌ల్ నోటీసులు పంపింది. 24 గంట‌ల్లో క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

తెలంగాణ ప్ర‌జ‌లు, రైతుల కోసం ప్ర‌భుత్వం దృష్టి సారించాలి. క‌నీసం యాక్ష‌న్ ప్లాన్ లేకుండా పంట‌లు వేయొద్ద‌ని చేతులు ఎత్తేసింది. కొవిడ్ స‌మ‌యంలోనూ వ్య‌వ‌సాయం ఆగ‌లేదు.. రైతులు పంట‌ను పండించారు. కానీ ఇవాళ వ్య‌వ‌సాయం ఆపాల‌ని అంటున్న‌రు. కేసీఆర్ పొలం వైపు నీళ్లు పోతున్నాయ‌ని క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నారు. ఇదేనా నువ్వు చేసే రాజ‌కీయం అని క్రిశాంక్ మండిప‌డ్డారు.

Advertisement
Advertisement