Oil Palm Complex | ఖమ్మం జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ కాంప్లెక్స్
Oil Palm Complex | తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా ఖమ్మం జిల్లాలో రూ. 300 కోట్ల పెట్టుబడితో ప్రయివేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు.
Oil Palm Complex | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా ఖమ్మం జిల్లాలో రూ. 300 కోట్ల పెట్టుబడితో ప్రయివేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్(కార్పొరేట్ వ్యవహారాలు) రాకేశ్ స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈవో సౌగతో నియోగి సమావేశమయ్యారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపైన ముఖ్యమంత్రికి రాకేష్ స్వామి నివేదిక అందజేశారు.
తెలంగాణలోనే మొట్టమొదటి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీలో పలు కీలక అంశాలపైన చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి లభించనుంది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, నర్సీరీ, ఆర్ అండ్ డీ కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమి ని గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది.
సీడ్ గార్డెన్ కోసం అదనంగా 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రాసెసింగ్ మిల్ కోసం రహదారిని విస్తరించాలని ముఖ్యమంత్రిని కోరారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





