త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NRI BRS UK | ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగానికి కేసీఆర్, కేటీఆర్ శుభాకాంక్షలు

NRI BRS UK | ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం 15వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి బృందం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని వారి నివాసంలో కలిశారు.

S

Telangana | Published On Dec 30, 2025, 2.20 pm IST

NRI BRS UK | ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగానికి కేసీఆర్, కేటీఆర్ శుభాకాంక్షలు
Advertisement

అధినేత కేసీఆర్‌ని కలిసిన ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం నాయకులు
15వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన కేటీఆర్

NRI BRS UK | త్రినేత్ర‌.న్యూస్ : ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం 15వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి బృందం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని వారి నివాసంలో కలిశారు. ముందుగా కేటీఆర్ కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లో ఉంటూ పార్టీకి ఎల్లప్పుడూ అండగా ఉంటూ అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు.

తరువాత నవీన్ రెడ్డి బృందం అధినేత కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై, వారి ఆశీర్వాదం తీసుకొని, పలు అంశాలపై చర్చించారు. ఉద్యమ సమయం నుండి లండన్ వేదికగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం చేసిన పోరాటం ఎప్పటికీ మరవలేమని, అన్ని సందర్భాల్లో పార్టీ గొంతుకై ఖండాంతరాల్లో నిర్విరామంగా పని చేస్తున్నారని, అదే స్ఫూర్తిని కొనసాగించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ ప్రజలకు మీరంతా అండదండలుగా ఉంటూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని దిశా నిర్దేశం చేసి, మళ్లీ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వారికి భరోసా ఇచ్చారు. అలాగే ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం 15 వ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం అధ్యక్షుడు నవీన్ రెడ్డి వారి కార్యవర్గం పక్షాన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడో మైళ్ల దూరంలో ఉన్నా కానీ గులాబీ జెండా మోసి వారి నాయకత్వంలో పని చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటామని తెలిపారు. అలాగే 15 సంవత్సరాలుగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే బృందాన్ని ప్రోత్సహిస్తున్న వివిధ హోదాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు, క్షేత్రస్థాయిలోని వివిధ సంఘాలకు, ప్రవాస సంస్థలకు, వివిధ మీడియా సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ రానున్న రోజుల్లో సైతం అదే స్ఫూర్తితో పని చేస్తూ, మళ్లీ కేసీఆర్‌ని ముఖ్యమంత్రిగా చేసే వరకు అవిశ్రాంతంగా శ్రమించి ప్రజలకు అండగా ఉంటామని నవీన్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఎన్నారై బీఆర్ఎస్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల, అడ్వైసరీ బోర్డు చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి గొట్టెముక్కల, కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement