RS Praveen Kumar | బీఆర్ఎసోళ్లవే కాదు.. రేవంత్, పొంగులేటి భూములపై కూడా విచారణ జరపాలి
RS Praveen Kumar | తమ భూములు ఆస్తులపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్, హరీష్ రావు కోరారని.. ఇలా విచారణ జరిపితే తన బండారం బయట పడుతుందని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై వేధింపు కమిటీ వేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు.
- బండారం బయటపడుతుందనే బీఆర్ఎస్ నేతలపై వేధింపు కమిటీ వేశారు
- తిరుపతిరెడ్డి కబ్జా చేసిన భూములపై విచారించాలి
- చివరకు రేవంత్‌ను పట్టిచ్చిన స్టీఫెన్ సన్ భూములపై కూడా విచారణ చేస్తారట
- దేవసేన కమిటీ ఫోన్ నెంబర్ సహా కార్యాలయ వివరాలు వెల్లడించాలి
- విచారణ కమిటీ దారి తప్పకుండా మేం చూస్తం
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్
RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్: తమ భూములు ఆస్తులపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) కోరారని.. ఇలా విచారణ జరిపితే తన బండారం బయట పడుతుందని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై వేధింపు కమిటీ వేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్ (CM Revanth), మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) కుటుంబాలపై వచ్చిన ఫిర్యాదులను కూడా విచారణ పరిధిలో చేర్చాలన్నారు. ఇబ్రహీంపట్నం, రాందాస్ పల్లి భూముల కబ్జాపై అధికారుల కమిటీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పసుమాములలో కబ్జా చేసిన భూములపై అధికారుల కమిటీ విచారించాలన్నారు. చివరకు 50 లక్షలు లంచం ఇస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన స్టీఫెన్ సన్ భూములపై కూడా విచారణకు ఆదేశించారని తెలిపారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కబ్జాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన. కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకుల మీద కక్షపూరిత రాజకీయం నడుస్తోంది. కమీషన్లు, సిట్‌లతో రేవంత్ పాలన సాగిస్తున్నారు. వివక్షాపూరిత ప్రతీకార పాలనలో భాగంగా తాజాగా జీవో 134 తెచ్చారు. అసెంబ్లీలో 22ఏ భూములపై చర్చ తర్వాత విచారణ కోసం జీవో 134 కింద కమిటీ వేశామని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ ప్రజలను పీడిస్తున్న 22ఏ నిషేధిత భూముల జాబితాపై ప్రజల మధ్యకు వెళ్ళింది కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులే.
గ్రౌండ్‌లో ప్రత్యర్థి టీం లేనట్టుగా..
ప్రజలిచ్చిన వేలాది ఫిర్యాదులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభకు రానివ్వలేదు. అసెంబ్లీ నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. ఆ ఒక్క రోజుకు కాదు మొత్తం సెషన్ కు సస్పెండ్ చేశారు. ఆరోజు అసెంబ్లీకి రాని వారిని కూడా సస్పెండ్ చేశారు. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ప్రత్యర్థి టీం లేనట్టుగా అధికార పక్షం అసెంబ్లీలో బీఆర్ఎస్ లేకుండానే ఏకపక్షంగా వ్యవహరించింది. పొంగులేటి మూడున్నర గంటలు 22ఏ పై మాట్లాడారు. అసెంబ్లీలో అవకాశం రాకపోవడంతో మా నేత హరీష్ రావు తెలంగాణ భవన్ లో 22ఏ పై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.
అందులో ఆ వివాదాస్పద అధికారి ఉన్నాడు..
ఇపుడు జీవో 134 తో ఐఏఎస్ అధికారుల కమిటీ వేశారు. ఆ కమిటీలో వివాదాస్పద అధికారి సందీప్ కుమార్ ఝా ఉన్నారు. విప్ ఆది శ్రీనివాస్ ను కూడా ఆయన అవమానపరిచారు. అధికారుల కమిటీ కాదు అది తొండి కమిటీ. విచారణ మార్గదర్శకాల్లో కేసీఆర్ అండ్ అదర్స్, అసోసియేట్స్ అని పేర్కొనడమే రేవంత్ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం. అదర్స్, అసోసియేట్స్ పేరుతో బీఆర్ఎస్ నేతలపై వేధింపులకు హద్దు ఉంటుందా? రేవంత్ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న చందంగా వ్యవహరిస్తున్నారు.
చివరకు 50 లక్షలు లంచం ఇస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్టీఫెన్ సన్ భూములపై కూడా విచారణకు ఆదేశించారు. స్టీఫెన్ సన్ ను బెదిరించడానికే ఆయన ఆస్తులపై విచారణకు ఆదేశించారు. స్టీఫెన్ సన్ ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయే ప్రమాదముంది. కేవలం 16 మందికే విచారణను పరిమితం చేయడం కుట్ర. అధికారులు రేవంత్ ట్రాప్‌లో పడొద్దు. విచారణ పరిధిలో ప్రజల నుంచి పొంగులేటి రేవంత్ కుటుంబాల పై వచ్చిన ఫిర్యాదులను కూడా చేర్చాలి.
రాఘవ డెవలపర్స్‌పై కూడా..
8 వేల కోట్ల విలువైన అసైన్‌మెంట్ భూములు కొట్టేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షకు సంబంధించిన వ్యవహారంపై అధికారుల కమిటీ విచారించాలి. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పసుమాములలో కబ్జా చేసిన భూములపై అధికారుల కమిటీ విచారించాలి. ఇబ్రహీం పట్నం రాందాస్ పల్లి భూముల కబ్జా పై అధికారుల కమిటీ విచారణ చేయాలి. ఖానామెట్, గచ్చిబౌలి డైమండ్ హిల్స్, శేరి లింగంపల్లిలో కాంగ్రెస్ నేతల భూ దందాలపై జీవో 134 కింద ఏర్పాటైన అధికారుల కమిటీ విచారించాలి. ఫీనిక్స్ నుంచి రాత్రికి రాత్రే డెవెలప్‌మెంట్ హక్కులు చేజిక్కించుకున్న పొంగులేటి కి చెందిన రాఘవ డెవెలపర్స్ పై అధికారుల కమిటీ విచారణ జరపాలి. వట్టి నాగుల పల్లిలో పొంగులేటి భూ దందాలపై విచారణ కమిటీ ద్రుష్టి సారించాలి.
460 ఎకరాలుందని సమాచారం..
మాకందిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 460 ఎకరాల భూమి ఉంది. దానిపై కూడా అధికారుల కమిటీ విచారణ చేయాలి. కేసీఆర్ అండ్ అదర్స్ పేరిట రేవంత్ రెడ్డి 4 కోట్ల మంది ప్రజలపై రేవంత్ రెడ్డి కేసులు పెట్టేట్టు కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాక్షాసానందానికి దళిత గిరిజనులు బలవుతున్నారు. టెనెన్సీ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయల భూములను రేవంత్ కుటుంబం కొట్టేస్తోంది. రేవంత్ కుటుంబ సభ్యులకు వేల కోట్ల ఆస్తులు జమవుతున్నాయి?
రేవంత్ కుమార్తె 8 వేలకే ఎలా కొన్నారు?
రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి కొంపల్లిలో 150 కోట్ల విలువైన భూమిని ఎనిమిది కోట్లకే కొన్నారు. ఇది మనీ లాండరింగ్ కాక పోతే మరేమిటి? లక్షా యాభై వేలకు గజం పలికే భూమిని రేవంత్ కుమార్తె 8 వేలకే ఎలా కొన్నారు? విచారణ జరగాల్సింది ఇలాంటి దందాలపై కదా! రేవంత్ రెడ్డి అల్లుడు మెడికవర్ హాస్పిటల్స్ లో వాటాదారు. మెడికవర్ ఆస్పత్రులు రాష్ట్రమంతటా విస్తరిస్తున్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ లో మాత్రం చిన్నారులు ఐదుగురు బలయ్యారు. మెడికవర్ ఆస్పత్రి వాటాలు అమ్మిన వ్యవహారంపై విచారణ జరగాలి. హైదరాబాద్ చుట్టుపక్కలా 22ఏ తో వేలాది మంది రైతులు బాధ పడుతున్నారు. ఆదిభట్లలో ఫోర్జరీ సంతకాలతో కాంగ్రెస్ నేతలు వందల ఎకరాలు కబ్జాకు ప్రయత్నిస్తున్న తీరుతో రైతులు లబో దిబో మంటున్నారు. వీటిపై కూడా అధికారుల కమిటీ విచారణ జరపాలి.
దేవసేన కమిటీ ఫోన్ నెంబర్ సహా తమ కార్యాలయ వివరాలు వెల్లడించాలి. బీఆర్ఎస్ నేతలకే విచారణ పరిమితి కాకూడదు.. ప్రజలెవ్వరూ ఫిర్యాదులిచ్చినా విచారణ చేయాలి. 134 జీవో ద్వారా ఏర్పాటైన కమిటీ దారి తప్పకుండా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. ఆ కమిటీ ముందు మాకు వచ్చిన సమాచారాన్ని పెడతాం. 134 జీవోపై ఇప్పుడే న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచన లేదు.
ప్యారడైజ్ మూవీలో ఆ పాత్రకు విశేష స్పందన..
కేసీఆర్ అంటే ప్రజలకు ఓ ఎమోషన్. కేసీఆర్ కేవలం బీఆర్ఎస్ నాయకుడు కాదు. తెలంగాణ తెచ్చిన నేత. గణేష్ నిమజ్జనంలో కేసీఆర్ పై ప్రజలు ప్రేమతో పాటలు పెట్టుకుంటే తప్పేమిటి? రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకుంటే ఎవరు వద్దన్నారు. ప్రజలకు రేవంత్ రెడ్డి అంటే ప్రేమ లేదు కాబట్టే ఆయన పాటలు పెట్టుకోవడం లేదు. కేసీఆర్ పై ప్రజలు చాటుకుంటున్న అభిమానంపై ఆంక్షలు సబబు కాదు. సజ్జనార్ ఆదేశాలు చట్టబద్ధం కావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో తన సొంత పాటలు పెట్టుకోవడం చట్ట విరుద్ధం. పారడైజ్ సినిమాలో ప్రియదర్శి కేసీఆర్ ను పోలిన పాత్రకు విశేష స్పందన వ్యక్తమవుతోంది. ఇది కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకున్న ప్రేమకు నిదర్శనం అని ఆర్ఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు.
ఈ మీడియా సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమళ్ల రాకేష్ కుమార్, బీఆర్ఎస్ నేతలు అభిలాష్ రంగినేని, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్, మంద శ్యామ్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Driving Licence Mobile Number Update | సెప్టెంబర్ 25 లోపు డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోతే లైసెన్స్ రద్దు?
- ●KTR | కేసీఆర్‌ను ఏ 'సర్' కూడా ఓడించలేదు
- ●Sharwanand | ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ - సంక్రాంతికి థియేటర్లలోకి జార్జ్ క్రిష్
- ●Cyber Fraud WhatsApp Reply No | ఓటీపీ లేదు, లింక్ అసలే లేదు.. కేవలం 'నో' అని రిప్లై ఇస్తే రూ.1.70 లక్షలు మాయం
- ●KTR | సుప్రీం తీర్పు.. రాహుల్, రేవంత్‌కు చెంపపెట్టు : కేటీఆర్
- ●FSSAI | ఇకపై పనీర్ పేరుతో అమ్మకాలు కుదరవా? ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రతిపాదన..

Driving Licence Mobile Number Update | సెప్టెంబర్ 25 లోపు డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోతే లైసెన్స్ రద్దు?

KTR | కేసీఆర్‌ను ఏ 'సర్' కూడా ఓడించలేదు

Sharwanand | ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ - సంక్రాంతికి థియేటర్లలోకి జార్జ్ క్రిష్

Cyber Fraud WhatsApp Reply No | ఓటీపీ లేదు, లింక్ అసలే లేదు.. కేవలం 'నో' అని రిప్లై ఇస్తే రూ.1.70 లక్షలు మాయం




