BJP Chief Ramchandar Rao | 99 రోజుల ప్రణాళిక కాదు.. కాంగ్రెస్‌కు మిగిలింది 999 రోజులే
బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (Ramchandar Rao) ‘ఇగ సహించదు తెలంగాణ - సేవ్ తెలంగాణ’ పోస్టర్(Ega sahinchadu telangana-save telangana) ను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిపాలనా వైఫల్యాలపై గట్టిగా పోరాడుతామని పేర్కొన్నారు.
- చేతకాని పాలనను ఇక సహించం
- ‘ఇగ సహించదు తెలంగాణ - సేవ్ తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణలో బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
త్రినేత్ర.న్యూస్: బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (Ramchandar Rao) ‘ఇగ సహించదు తెలంగాణ - సేవ్ తెలంగాణ’ (Ega sahinchadu Telangana-save Telangana) పోస్టర్ ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిపాలనా వైఫల్యాలు, ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో భాజపా ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడుతామని రాంచందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాటమే పార్టీ లక్ష్యమని తెలిపారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రైతులకు రైతు భరోసా అందడం లేదని, పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వడం లేదని, వృద్ధులకు పెన్షన్లు సకాలంలో అందించకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ల పెంపు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఈ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసేలా ఈ పోస్టర్‌ను రూపకల్పన చేసినట్లు తెలిపారు.
రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రభుత్వం ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ పేరిట 99 రోజుల (99 days) కార్యాచరణను ప్రకటించిందని, ఈ ప్రభుత్వానికి ఇంకా 999 రోజులే (999 days) మిగిలున్నాయని పేర్కొన్నారు. ఈ 999 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య, ప్రజావ్యతిరేక, వైఫల్య పాలనకు వ్యతిరేకంగా పోరుబాట ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈనెల 16న మండల కేంద్రాల్లో కార్యకర్తలు ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఈనెల 20న జిల్లా కేంద్రాల్లో అన్ని కలెక్టరేట్ల (collectorates) ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు. తదుపరి కార్యక్రమాలను త్వరలో ప్రకటిస్తామని స్ఫష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



