Petrol Diesel Shortage | మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు
Petrol Diesel Shortage | రాష్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు (Petrol Diesel Shortage) మొదలయ్యాయి. ఎక్కడ చూసినా బంకుల్లో కార్లు, ఆటోలు, బైకులు పెద్ద పెద్ద క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.
Petrol Diesel Shortage | త్రినేత్ర.న్యూస్: రాష్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు (Petrol Diesel Shortage) మొదలయ్యాయి. ఎక్కడ చూసినా బంకుల్లో కార్లు, ఆటోలు, బైకులు పెద్ద పెద్ద క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని, నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ.. పెట్రోల్ బంకుల్లో మాత్రం నో స్టాక్ (No Stock) బోర్డులు దర్శనమిస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడం, సూర్యాపేట సహా పలు జిల్లాల్లో డీజిల్, పెట్రోల్ కొరతతో బంకులు మూతపడ్డాయి. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ సహా కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెట్రోల్, డీజిల్ కొరతతో హైదరాబాద్‌లో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల్లో పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. తమ వంతు కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఇక నగరంలో సీఎన్‌జీ కొరత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇరాన్, అమెరికా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సీఎన్‌జీ సమస్య కొనసాగుతూనే ఉన్నది. గ్యాసం కోసం బంకుల ముందు ఆటోలు బారులు తీరాయి.

సూర్యాపేట జిల్లాలో 15కుపైగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మొదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో నాలుగు బంకులు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కొరతతో అందులో రెండు ఇప్పటికే మూతపడగా, మిగిలినవి వారంలో నాలుగు రోజులు మాత్రమే తెరచి ఉంటున్నాయి. ఇక మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఉన్న 12 పెట్రోల్ బంక్‌లలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో లారీలు, ట్రాక్టర్లు, రైతులు, వ్యాపారులు, క్రషర్ మిల్లులు, వరి కోత, మొక్క జొన్న నూర్పిడి యంత్రాల దారులు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి స్పందించారు. కేంద్రం చెప్పినా ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం లేదని చెప్పారు. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేసినా పెట్రోల్, డీజిల్ అందడం లేదన్నారు. పోర్టల్‌లో ట్యాంకర్ కేటాయించినా అది బంక్‌కి రావడం లేదని వెల్లడించారు. స్టాక్ పెట్టకూడదనే ఉద్దేశంతో పంపిణీ నిలిపివేశారని ఆరోపించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





