త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Urea | యూరియాపై ఆందోళన అవసరం లేదు : అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ ఉపకులపతి జానయ్య

Urea | యూరియాపై రైతులకు ఆందోళన అవసరం లేదని, దుష్ప్రచారాలను నమ్మవద్దని రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెస‌ర్ జానయ్య సూచించారు. గత పది, పదిహేను సంవత్సరాలుగా ఇతర ఎరువులతో పోలిస్తే యూరియా చౌకగా లభ్యమవుతుండటంతో వివిధ పంటల్లో దాని వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

P

Telangana | Published On May 25, 2026, 9.05 pm IST

Urea | యూరియాపై ఆందోళన అవసరం లేదు : అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ ఉపకులపతి జానయ్య
Advertisement

Urea | యూరియాపై రైతులకు ఆందోళన అవసరం లేదని, దుష్ప్రచారాలను నమ్మవద్దని రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెస‌ర్ జానయ్య సూచించారు. గత పది, పదిహేను సంవత్సరాలుగా ఇతర ఎరువులతో పోలిస్తే యూరియా చౌకగా లభ్యమవుతుండటంతో వివిధ పంటల్లో దాని వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. దిగుబడిలో పెద్ద మార్పు లేకపోయినా, అధిక యూరియా వాడకం వల్ల ఆరోగ్య, వాతావరణ సమస్యలు పెరిగాయని తెలిపారు. గల్ఫ్ యుద్ధ ప్రభావం వల్ల యూరియా సరఫరా తగ్గినప్పటికీ రైతాంగంపై పెద్ద ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయని అన్నారు. సరఫరా ఆశించినంతగా లభ్యం కానట్లయితే, అదే ధరలతో నానో యూరియా మార్కెట్లో తగినంతగా అందుబాటులో ఉందని చెప్పారు. నానో యూరియా వాడకంతో మొక్కలకు అవసరమైన నత్రజని అందుతుందని, సాధారణ యూరియాతో వచ్చే ఫలితాలే లభిస్తాయని వివరించారు. భారత ప్రభుత్వం ధ్రువీక‌రించిన జీవన ఎరువులు కూడా యూరియాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని ఆయన సూచించారు. అలాగే పచ్చిరొట్ట విత్తనాలను వినియోగించి తొలకరి వర్షాల సమయంలో పొలాల్లో వేసి, 40 రోజుల్లో వాటిని కలియదున్నితే నేలలో సేంద్రియ కర్బనం పెరిగి భూసారాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు.

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ సంవత్సరం వర్షపాతం కొంత తగ్గే అవకాశం ఉన్నందున, బోరు, బావులు, చెరువుల ఆధారిత సాగులో వరికి బదులు పప్పుదినుసులు, నూనెగింజలు మరియు ఇతర మెట్ట పంటలు వేయడం మంచిదని ఆయన సూచించారు. వీటికి యూరియా అవసరం కూడా తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని రైతులు పంట మార్పిడి వైపు మొగ్గు చూపాలని, తద్వారా ప్రజల ఆరోగ్యంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని ఉపకులపతి జానయ్య సూచించారు.

Advertisement
Advertisement