త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mukhra-K villagers Protest | మీట‌ర్లు వ‌ద్దే వ‌ద్దు.. అట్ల‌యితే మాకు ఉరితాళ్లే దిక్కు.. ట్రాన్స్‌ఫార్మ‌ర్ వ‌ద్ద‌ ముఖ్రా (కే) రైతుల వినూత్న నిర‌స‌న‌

Mukhra-K villagers Protest | ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా (కే) గ్రామ రైతులు శ‌నివారం వినూత్న నిర‌స‌న‌కు దిగారు. ఉచిత కరెంటుకు మీటర్లు పెడితే ఇక త‌మ‌కు ఉరే దిక్కు అని.. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చేతిలో ఉరితాళ్లు పట్టుకొని నిరసన తెలిపారు.

S

Telangana | Published On May 30, 2026, 12.01 pm IST

Mukhra-K villagers Protest | మీట‌ర్లు వ‌ద్దే వ‌ద్దు.. అట్ల‌యితే మాకు ఉరితాళ్లే దిక్కు.. ట్రాన్స్‌ఫార్మ‌ర్ వ‌ద్ద‌ ముఖ్రా (కే) రైతుల వినూత్న నిర‌స‌న‌
Advertisement

Mukhra-K villagers Protest | త్రినేత్ర‌.న్యూస్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా (కే) గ్రామ రైతులు శ‌నివారం వినూత్న నిర‌స‌న‌కు దిగారు. ఉచిత కరెంటుకు మీటర్లు పెడితే ఇక త‌మ‌కు ఉరే దిక్కు అని.. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చేతిలో ఉరితాళ్లు పట్టుకొని నిరసన తెలిపారు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. నాడు కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ ప్రభుత్వం మీటర్లు పెట్టలేదని గుర్తు చేశారు.

ప్రాణం పోయినా సరే రైతుల మోటార్లకు మీటర్లు మాత్రం పెట్టనని కేంద్ర ప్రభుత్వానికి తెగేసి చెప్పిన ధైర్య‌శాలి కేసీఆర్ అని కొనియాడారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వంతో కలిసి తెలంగాణ రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఒప్పందం చేసినట్టు అనుమానం వస్తుందన్నారు. ఇక మోటార్లకు మీటర్లు పెడితే రైతుల బ‌తుకులు ఆగమవుతాయని, రైతులకు మిగిలేది ఉరే అని ఆవేదన వ్య‌క్తం చేశారు.

పంట‌లు కొనేవాళ్లు దిక్కులేక‌..

10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదన్నారు. కాంగ్రెస్ పాల‌న‌లో రుణమాఫీ పూర్తి కాక, రైతు భరోసా అందించ‌క‌, పండించిన పంటలు సమయానికి కొనేవాళ్లు దిక్కులేక రైతుల బతుకులు ఆగమ‌య్యాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ మాజీ స‌భ్యుడు గాడ్గే సుభాష్, దత్త, మారోతి, ప్రహ్లాద్, వెంకటి, తులసిరామ్, తిరుపతి, విఠల్, రైతులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement