CM Revanth Reddy | కేసీఆర్ పార్టీకే మనుగడే లేదు
Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని, కొత్త పార్టీ అవసరం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ తనకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు.
- చచ్చిన శవానికి అలంకరణ చేస్తే లేచి వస్తుందా?
- కొత్త పార్టీకి అసలు ఏం పని
- కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కోరుకునేది నేనే
- సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
CM Revanth Reddy | చచ్చిన శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి వస్తుందా? వాళ్ల తాపత్రయం వాళ్లదే కానీ, బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీపై స్పందించారు. అసలు కొత్త పార్టీకి ఏం పని? ఉన్న పార్టీయే ఉంటదా.. పోతదా? కేసీఆర్ పార్టీకి ఇక మనుగడ లేదన్నారు. తెలంగాణ రావాలని ప్రజలు ఎంతో ఓర్చుకున్నారని, అందుకే వారికి అధికారం ఇచ్చారని తెలిపారు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంకారంతో పని చేశారని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
బీఆర్ఎస్‌కు సంబంధాలు తెగిపోయాయి..
వారి అహంకారాన్ని ఇంకా భరించలేకనే ప్రజలు అధికారం నుంచి దించారని, ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబంతో కానీ, ఆ పార్టీతో కానీ ప్రజలకు సంబంధం తెగిపోయిందని, ఇప్పుడు వారు కేవలం తమ కుటుంబం కోసమే పాటుపడుతున్నారన్నారు. దాని కోసమే ఆ కుటుంబం అంతా కష్టపడుతోందని విమర్శించారు. ఆ కుటుంబంలో పంపకాల పంచాయతీ అందరికీ కనిపిస్తూనే ఉంది కదా! అందుకే ఈ అనుబంధ సంస్థలు కొత్తగా వచ్చాయన్నారు.
కేసీఆర్ ఆరోగ్యాన్ని కాంక్షించేది నేనే..
కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంది నేనేనని రేవంత్‌రెడ్డి తెలిపారు. తాను వెళ్లి కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నానన్నారు. అసెంబ్లీకి ఒక్కసారి వచ్చినప్పుడు కూడా కలిసింది తానేనన్నారు. ఆయన చనిపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను? మాకేం లాభం? ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదని, తాను విజయం సాధించాను.. ఇక అయిపోయిందన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే కొంతమందితో కేటీఆర్ సీఎం కావాలని చెప్పించారని.. అయితే గీతే వాళ్ల కుటుంబమే అలా అనుకుంటుందన్నారు. వారసత్వ సంపద కోసం ఆయనకు చెడు జరగాలని వాళ్లే కోరుకుంటారన్నారు.
కిషన్‌రెడ్డి ఏం చేశారు?
కాళేశ్వరం సీబీఐకి ఇవ్వాలని, 48 గంటల్లో అరెస్టులుంటాయని కిషన్‌రెడ్డి అన్నారని రేవంత్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం సీబీఐకి ఇస్తే మరేం చేశారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ అడ్డుకోవడం కోసమే హరీష్ ఢిల్లీ వెళ్లారని, బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకేనని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్‌లో చార్జ్ షీట్ చేశామని, అరవింద్ కుమార్‌ని సస్పెండ్ చేశామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో వందల కాల్స్ అనలైజ్ చేస్తున్నారని, రెండేళ్ల తర్వాత ప్రభాకర్ రావు అందుబాటులోకి వచ్చారన్నారు.
కవిత కామెంట్స్‌పై మాట్లాడాలి..
కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కవిత మాట్లాడిన వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చుట్టు గుంట నక్కలు ఉన్నాయని అందని.. మన మనిషి కాదు మర మనిషి.. కేసీఆర్ భవిష్యత్తులో బీజేపీతో కలవబోమని అని కేసీఆర్ నమ్మే దేవుడిపై ఒట్టేసి చెబుతారా? అంటూ ప్రశ్నించారు. తేజస్వి సూర్య మాటలపై కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడితే బీఅరెస్ వెధవలకు వినిపించలేదా.. వెధవలకు అంతా వేదవల్లాగే కనిపిస్తారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు కొనసాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



