త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | అర్హులైన ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదు.. స‌ర్ ప్ర‌క్రియ‌పై కేటీఆర్ దిశానిర్దేశం

KTR | ఓటరు జాబితా ప్ర‌త్యేక సవరణ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకుండా చూడాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో డూప్లికేట్‌, అనర్హ ఓటర్లను గుర్తించి జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్‌ (SIR) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

P

Telangana | Published On Jul 22, 2026, 7.30 pm IST

KTR | అర్హులైన ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదు.. స‌ర్ ప్ర‌క్రియ‌పై కేటీఆర్ దిశానిర్దేశం
Advertisement

KTR | ఓటరు జాబితా ప్ర‌త్యేక సవరణ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకుండా చూడాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో డూప్లికేట్‌, అనర్హ ఓటర్లను గుర్తించి జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్‌ (SIR) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలోని కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పలు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో లక్షల మంది ఓటర్లకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో వారిలో కొందరిని నోటీసుల జాబితాలో చేర్చారని కేటీఆర్‌ పేర్కొన్నారు. అలాంటి ఓటర్లకు నోటీసులు అందిన వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి అవసరమైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

ఆగ‌స్టు 10 త‌ర్వాత కీల‌కం..

అర్హత ఉన్న వారి పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో మిస్‌ కాకూడదని, అదే సమయంలో డూప్లికేట్‌, అనర్హ ఓటర్లకు చోటు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆగస్టు 3 వరకు ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని సూచించారు. ఆగస్టు 10న డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా విడుదలైన తర్వాత కీలకమైన దశ ప్రారంభమవుతుందని తెలిపారు. జాబితాలో ఉన్న పేర్లు, లేని పేర్లను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన చోట క్లెయిమ్స్‌ అండ్‌ అబ్జెక్షన్స్‌ ప్రక్రియను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని..

ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రతి అర్హ ఓటరును గుర్తించి నమోదు చేయించే బాధ్యతను పార్టీ యంత్రాంగం తీసుకోవాలని కేటీఆర్‌ అన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు, సభ్యత్వ ఇన్‌చార్జిలు, జనరల్‌ సెక్రటరీలు, కోఆర్డినేటర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న జిల్లాలను కేటీఆర్‌ అభినందించారు. దీన్ని ఓ బాధ్యతగా తీసుకుని పార్టీ శ్రేణులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బూత్‌ స్థాయి వరకు పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హులు లేదా డూప్లికేట్‌ ఓటర్లు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ ఆదేశించారు. సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ ఎల్‌. రమణ, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, గంప గోవర్ధన్‌, బాల్క సుమన్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement