త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raid | ఏసీబీకి చిక్కిన ఖానాఫూర్ ఫారెస్ట్ సెక్ష‌న్ అధికారి..

ACB Raid | రూ.12వేల లంచం తీసుకుంటూ ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ రేంజ్‌, డివిజన్‌లో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఐండ్ల రవీందర్‌ లంచం డిమాండ్‌ చేసినట్లు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తెలిపింది.

P

Telangana | Published On Oct 8, 2026, 4.59 pm IST

ACB Raid | ఏసీబీకి చిక్కిన ఖానాఫూర్ ఫారెస్ట్ సెక్ష‌న్ అధికారి..
Advertisement

ACB Raid | రూ.12వేల లంచం తీసుకుంటూ ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ రేంజ్‌, డివిజన్‌లో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఐండ్ల రవీందర్‌ లంచం డిమాండ్‌ చేసినట్లు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తెలిపింది. ఖానాపూర్‌ రేంజ్‌ పరిధిలోని ఓ టింబర్‌ డిపో లైసెన్స్ రెన్యువ‌ల్‌కు సంబంధించిన తనిఖీ నివేదికను ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంది. అయితే, నివేదిక‌ను అనుకూలంగా ఇస్తానంటూ ర‌వీంద‌ర్ రూ.12వేలు డిపో య‌జ‌మానిని డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించాడు.

ఈ క్ర‌మంలో గురువారం ఆదిలాబాద్ రేంజ్ అధికారులు డిపో య‌జ‌మాని నుంచి ర‌వీంద‌ర్ డ‌బ్బులు తీసుకుంటుండ‌గా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న రూ.12 వేల నగదును రవీందర్‌ వద్ద నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విధులను అక్రమంగా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించి అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ తెలిపింది. అనంతరం ఆయనను అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొన‌సాగుతోంద‌ని అధికారులు వివ‌రించారు. లంచం డిమాండ్‌ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064లో సంప్ర‌దించాల‌నికోరారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామ‌ని వివ‌రించారు.

Advertisement
Advertisement